దేశంలో కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ల పరిస్థితిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం 30 కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని తెలిపింది. అందులో మూడు టీకాలు అడ్వాన్స్డ్ ట్రయల్స్ స్టేజీలలో ఉన్నట్లు పేర్కొంది. నాలుగు టీకాలు ప్రీ-క్లినికల్ అభివృద్ధి దశలో ఉన్నాయని వెల్లడించింది.
"ముప్పై వ్యాక్సిన్ క్యాండిడేట్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయి. మూడు టీకాలు ఫేజ్ 1, 2, 3 స్టేజీలలో ఉన్నాయి. నాలుగు వ్యాక్సిన్లకు పైగా అడ్వాన్స్డ్ ప్రీ-క్లినికల్ అభివృద్ధి దశలో ఉన్నాయి."
-నిత్యానంద రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
కొవిడ్ బాధితులకు చికిత్స కోసం 13 పునర్వినియోగ ఔషధాలను పరిశీలిస్తున్నట్లు రాజ్యసభకు వెల్లడించారు. ఆగస్టు 7న కొవిడ్-19పై కరోనా నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.