ETV Bharat / bharat

శ్రీనగర్​లో నేడు పాఠశాలల పునఃప్రారంభం - kashmir

జమ్ముకశ్మీర్​లో ఆంక్షల పూర్తిస్థాయి తొలగింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేటి నుంచి శ్రీనగర్​లోని 190 పాఠశాలలను పునఃప్రారంభించేందుకు అనుమతించింది. కశ్మీర్​ లోయలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయని జమ్ముకశ్మీర్ ముఖ్య కార్యదర్శి రోహిత్ కన్సల్ వెల్లడించారు.

శ్రీనగర్​లో నేటి నుంచి పాఠశాలల పునరుద్ధరణ
author img

By

Published : Aug 19, 2019, 7:57 AM IST

Updated : Sep 27, 2019, 11:42 AM IST

ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​వ్యాప్తంగా విధించిన ఆంక్షల తొలగింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శ్రీనగర్​లో 190 ప్రాథమిక పాఠశాలలు నేడు పునఃప్రారంభం కానున్నట్లు జమ్ముకశ్మీర్​ ముఖ్య కార్యదర్శి రోహిత్ కన్సల్ వెల్లడించారు. కశ్మీర్​ లోయలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయని స్పష్టం చేశారు.

"శ్రీనగర్ జిల్లాలోనే 190 పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. మౌలిక వనరుల కల్పన, అభివృద్ధి పనుల పునరుద్ధరణతో పరిస్థితులు మరింత మెరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. "

- రోహిత్ కన్సల్, ముఖ్య కార్యదర్శి, జమ్ముకశ్మీర్

ఆదివారం కూడా ఆంక్షల సడలింపును కొనసాగించినట్లు స్పష్టం చేశారు. శనివారం 35 పోలీస్​ స్టేషన్ల ప్రాంతాల్లో ఆంక్షలను పాక్షికంగా ఎత్తేశామని, ఆదివారం 50 ఠాణాలకు ఈ పరిధిని విస్తరించామని ఆయన కన్సల్ పేర్కొన్నారు. నిషేధాజ్ఞల తొలగింపు సమయాన్ని ఆరు నుంచి ఎనిమిది గంటలకు పెంచామని తెలిపిన ఆయన దుకాణ యజమానులు వారి షాపులను ప్రారంభించుకోవచ్చని ప్రకటించారు.

ల్యాండ్​ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సాధ్యమైనంత త్వరగా ఫోన్లను వినియోగం లోకి తెస్తామన్నారు. కశ్మీర్​లోయలో ఫోన్ల సేవలను పునరుద్ధరించేందుకు బీఎస్​ఎన్​ఎల్ అధికారులు పనిచేస్తున్నారని కన్సల్ ప్రకటించారు.

ఇదీ చూడండి: 'మహాత్ముడి కలల భారతాన్ని నిర్మించామా?

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Sunday, 18 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1625: US Box Office Content has significant restrictions, see script for details 4225555
'Good Boys' is No. 1, ends a drought for R-rated comedies
AP-APTN-1006: US GA DoggyCon Parade AP Clients Only 4225513
Doggy Con: pop culture convention for furry friends
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.