ETV Bharat / bharat

1,157 మంది నేర చరితుల భవితవ్యం తేలేది రేపే - రాజకీయ నేతల నేర చరిత్ర

బిహార్ ఎన్నికల్లో పోటీ చేసిన 1,157 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈసీ నోటీసులు జారీ చేయగా.. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను బహిర్గతం చేశాయి.

Bihar assembly polls
బిహార్​
author img

By

Published : Nov 9, 2020, 10:39 AM IST

బిహార్ శాసనసభ ఎన్నిక‌ల్లో 25 శాతానికిపైగా నేర చ‌రితులు పోటీ చేసిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం వెల్లడించింది. మూడు ద‌శ‌ల్లో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో 371 మంది మ‌హిళ‌ల‌తో స‌హా మొత్తం 3,733 అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. ఇందులో మొత్తం 1,157 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నట్లు చివరి దశ పోలింగ్​ పూర్తయ్యాక ప్రకటించింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా రాజ‌కీయ పార్టీలు త‌మ అభ్యర్థుల నేర చ‌రిత‌ను నిర్ణీత గ‌డువులోగా ప్రజలకు తెలిసేలా బహిర్గతం చేయాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను ఎంచుకోవడానికి గల కార‌ణాల‌ను తెల‌పాల‌ని పార్టీల‌కు స్పష్టం చేసింది.

ఇదే తొలిసారి..

ఫలితంగా బిహార్​లో ఆయా పార్టీలు త‌మ అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించాయి. పూర్తి స్థాయి ఎన్నికల్లో అభ్యర్థుల వివరాలను వెల్లడించటం ఇదే మొదటిసారి.

మూడు సార్లు ప్రకటించాలి..

నేర చరిత్ర ఉన్నవారి వివరాలు ప్రజలకు తెలిసేలా టీవీ, పత్రికల్లో మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలని 2018 అక్టోబర్​లోనే ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. నామినేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ తేదీ అనంత‌రం నాలుగు రోజుల్లో అభ్యర్థి మొద‌టిసారిగా త‌న క్రిమిన‌ల్ రికార్డు గురించి ప్రజలకు తెలియ‌జేయాలంది. అనంత‌రం 5 నుంచి 8 రోజుల్లో రెండోసారి, ప్రచారం చివరి తేదీ నాటికి మూడోసారి త‌మపై ఉన్న నేరచరిత్రను వెల్లడించాలని స్పష్టం చేసింది.

వీటి ఆధారంగా తమ ప్రతినిధి ఎన్నుకోవటంలో ప్రజలు అవకాశాలు చూసుకుంటారని ఈసీ తెలిపింది.

పెరిగిన పోలింగ్ శాతం..

బిహార్​లో 2015 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం పెరిగింది. కరోనా సమయంలోనూ 57.05 శాతం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ గణాంకాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో 56.66 శాతం పోలింగ్ నమోదైంది.

ఇదీ చూడండి: బిహార్‌ బరి: ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.