ETV Bharat / bharat

100 మంది పొరుగుదేశాల నిపుణులకు 'టీకా' శిక్షణ

author img

By

Published : Dec 17, 2020, 8:30 AM IST

కరోనా టీకాల మూడో దశ ప్రయోగాల కోసం పొరుగుదేశాలకు చెందిన వంద మంది నిపుణులకు శిక్షణ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అఫ్గానిస్థాన్, భూటాన్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, శ్రీలంకకు చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది. మరింత మంది నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.

over-100-experts-from-friendly-nations-trained-for-clinical-trials-of-indian-covid-19-vaccine-official
100 మంది పొరుగుదేశాల నిపుణులకు 'టీకా' శిక్షణ

భారత్‌లో తయారవుతున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాల కోసం పొరుగున ఉన్న మిత్ర దేశాలకు చెందిన వంద మంది నిపుణులకు శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని కోసం విదేశాంగ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర జీవ సాంకేతిక విభాగం వెల్లడించింది. ఇందులో భాగంగా రెండు శిక్షణ నమూనాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది.

అఫ్గానిస్థాన్, భూటాన్‌, మాల్దీవులు, మారిషస్‌, నేపాల్‌, శ్రీలంకకు చెందిన వంద మంది నిపుణులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు జీవ సాంకేతిక విభాగం వెల్లడించింది. మరింత మంది నిపుణులు పాల్గొనేలా తదుపరి దశ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. కరోనా కట్టడికి ఆరు టీకాలు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండగా, వీటిలో నాలుగు దేశీయంగానే తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ టీకాల అభివృద్ధి కోసం 30 బృందాలు చురుకుగా పని చేస్తున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.