దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకా తీసుకున్న వారి సంఖ్య 10లక్షలు దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 10.5 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించినట్టు పేర్కొంది.
ఒక్కరోజు వ్యవధిలోనే 4,049 సెషన్ల ద్వారా 2,37,050 మందికి వ్యాక్సిన్ అందించినట్టు తెలిపింది ఆరోగ్య శాఖ. ఫలితంగా ఇప్పటివరకు వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన సెషన్ల సంఖ్య 18,167కు చేరింది.
ఇదీ చదవండి: దేశంలో మరో 14,545 మందికి కరోనా