ETV Bharat / bharat

ఆ ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్​డౌన్​ ఉల్లంఘన కేసులు! - ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్​డౌన్​ ఉల్లంఘన కేసులు

దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో.. మూడింట ఒక వంతు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఈ కారణంగా రాష్ట్రంలో లాక్​డౌన్​ను​ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తోంది ఠాక్రే ప్రభుత్వం. అయినప్పటికీ అక్కడ లక్షకుపైగా లాక్​డౌన్​ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి జరిమానాల రూపంలో 3 కోట్ల 76 లక్షల రూపాయలు వసూలయ్యాయి.

Over 1 lakh cases of lockdown violations registered in Maharastra
ఆ ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్​డౌన్​ ఉల్లంఘన కేసులు!
author img

By

Published : May 9, 2020, 6:53 PM IST

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమల్లో ఉన్నా.. అక్కడక్కడా ప్రజలు బయట తిరుగుతూనే ఉన్నారు. కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణం. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షకుపైగా లాక్​డౌన్​ నిబంధనల్ని ఉల్లంఘించిన కేసులు నమోదవ్వగా.. 19,297 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

నిబంధనల్ని ఉల్లంఘించిన సుమారు లక్షా 2 వేల మందిపై సెక్షన్​-188 కింద కేసులు నమోదుచేసినట్లు తెలిపారు అధికారులు.

సిబ్బందిపై దాడి...

వీటిలో 194 కేసులు పోలీసులపై దాడి ఘటనలే. వీటికి సంబంధించి 680 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనల్లో 73 మంది హోం​గార్డు​లు గాయపడ్డారు. ఆరోగ్య సిబ్బందిపై జరిగిన దాడులకు సంబంధించి 32 కేసులు నమోదయ్యాయి.

అక్రమ రవాణా కేసుల్లో భాగంగా 1,289 కేసులు నమోదుచేసిన పోలీసులు.. 54,611 వాహనాలను సీజ్ చేశారు. మొత్తంగా ఈ లక్ష కేసులకు సంబంధించి జరిమానాల రూపంలో 3 కోట్ల 76 లక్షల రూపాయలు రాబట్టారు.

ఇదీ చదవండి: హనీమూన్​కు వెళ్లాల్సిన నవజంటకు క్వారంటైన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.