బోనులో చిక్కిన ఎలుక ప్రాణాలు రక్షించినందుకు ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. బోనులో నుంచి బయట పడేసి ఇంట్లోకి తిరిగి వస్తుండగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. లాక్డౌన్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.
ఇదీ జరిగింది...
ఛండీగఢ్‌లోని 23వ సెక్టర్ నివాసి అజయ్ కుమార్. ఎలుక బెడద కారణంగా ఇంట్లో బోనును వాడుతుండేవాడు. అలా ఓ రోజు బోనులో ఎలుక చిక్కింది. దాన్ని దగ్గరిలోని పార్కులో పడేసేందుకు బయటికి వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అటుగా వెళుతున్న గస్తీ పోలీసుల కంటపడ్డాడు అజయ్.
ఇంకేముంది.. బయటికి వచ్చినందుకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అజయ్ తన పరిస్థితిని వివరిస్తున్నా.. లాక్డౌన్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం 17వ సెక్టార్ ఠాణాకు తరలించారు. చివరికి బెయిల్‌పై విడుదలయ్యాడు అజయ్.
ఇదీ చదవండి: అందని ప్రభుత్వ సాయం.. గుర్రపు డెక్కే ఆహారం!