చంద్రయాన్-2కు చెందిన విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించినట్టు నాసా ప్రకటించడంపై కౌంటర్ వేశారు ఇస్రో ఛైర్మన్ కె శివన్. తమ ఆర్బిటర్.. ల్యాండర్‌ను ఎప్పుడో గుర్తించిందని, ఆ విషయం ఇస్రో వెబ్సైట్లో ఉందని స్పష్టం చేశారు.
"దీనిపై ఇస్రో స్పందించదు. కానీ.. ల్యాండర్‌ను ఆర్బిటర్ గుర్తించిందని అదే రోజు(ల్యాండింగ్ సమయం) మేము వెల్లడించాం. అది మా వెబ్సైట్లోనూ ఉంది. అవసరమైతే వెబ్సైట్ చూడండి."
- కె.శివన్, ఇస్రో ఛైర్మన్
రాజస్థాన్‌లో జరిగిన ఓ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రయాన్-2 ప్రయోగంలో చివరి నిమిషంలో గల్లంతైన ల్యాండర్ విక్రమ్ జాడ లభించిందని నాసా మంగళవారం ప్రకటించింది. తమ లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌వో) విక్రమ్ శకలాలను గుర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు జాబిల్లిపై శకలాలు ఉన్న చిత్రాన్ని విడుదల చేసింది.
-
NASA finds Vikram Lander, releases images of impact site on Moon surface
— ANI Digital (@ani_digital) December 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/gFP4mFvqwI pic.twitter.com/x3iNposmTu
">NASA finds Vikram Lander, releases images of impact site on Moon surface
— ANI Digital (@ani_digital) December 3, 2019
Read @ANI Story | https://t.co/gFP4mFvqwI pic.twitter.com/x3iNposmTuNASA finds Vikram Lander, releases images of impact site on Moon surface
— ANI Digital (@ani_digital) December 3, 2019
Read @ANI Story | https://t.co/gFP4mFvqwI pic.twitter.com/x3iNposmTu
అయితే... నాసా ప్రకటనను ధ్రువీకరించాల్సిన అవసరం ఇస్రోకు లేదని స్పష్టం చేశారు శివన్.
ఇదీ చూడండి:- చంద్రయాన్-2: 'విక్రమ్' జాడను 'షణ్ముగ' కనుగొన్నారిలా...