ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల పొడిగింపునకు విపక్ష పార్టీలు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నేడు జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం(బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్)లో ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం.
పెండింగ్లో ఉన్న పలు బిల్లులకు ఆమోదం పొందాల్సి ఉన్నందున సమావేశాలను పొడిగించాల్సిన అవసరముందని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను పలు విపక్ష పార్టీల అధినేతలు తిరస్కరించినట్లు సమాచారం.
ఆగస్టు 2 వరకు పొడిగింపు!
జులై 16న మొదలైన 17వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 26న ముగుస్తాయి. ప్రస్తుత వర్షాకాల సమావేశాలను ఆగస్టు 2 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.