ETV Bharat / bharat

'పార్లమెంట్​ను అవమానించి ధర్నాకు దిగుతారా?'

author img

By

Published : Sep 24, 2020, 4:26 PM IST

పార్లమెంట్​ సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ప్రతిపక్షాల రాజకీయలు చుక్కాని లేని నావలా ఉన్నాయన్నారు జావడేకర్​. ప్రతిపక్షాలు... రాజ్యసభను అవమానించాయని విమర్శించారు.

Opposition shouldn't have boycotted the Parliament session: Prakash Javadekar
'విపక్షాలు రాజ్యసభను అవమానించాయి'

పార్లమెంటరీ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును ఎండగట్టారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్. ఎటువంటి లక్ష్యం లేకుండా పార్లమెంటును బహిష్కరించిన విపక్షాలు... నిరసనలు, ధర్నాలు చేశాయని మండిపడ్డారు. విపక్షాలు నీతిలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. విప్లవాత్మకమైన బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు సభాధ్యక్షుడి మాట వినకుండా సభలో గందరగోళం సృష్టించారన్నారు జావడేకర్​.

"పార్లమెంటులో ఎలాంటి సమస్యల మీదైనా చర్చించి, తమ అభిప్రాయలను తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. కానీ దానికి బదులు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి, ధర్నాకు దిగారు. రాజ్యసభను అవమానించారు. బిల్లులను ఆమోందించవద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నారు."

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్రమంత్రి

విపక్షాలు... రాష్ట్రపతిని కలవడానికి ఏడాదిలో 300 రోజులు ఉన్నాయి. కేవలం 70- 80 రోజులు జరిగే పార్లమెంట్​ సమావేశాల్లో ఎవరు ఏ అంశంపై మట్లాడినా.. తాము అవరోధం కల్పించలేదన్నారు కేంద్రమంత్రి. కీలక సమయంలో డిప్యూటీ ఛైర్మన్​ ఎంత చెప్పిన వినిపించుకోకుండా సభలో రభస సృష్టించారని ప్రతిపక్షాలను ఎండగట్టారు. ప్రతిపక్షాలు... సమావేశాలను బహిష్కరించకుండా ఉండాల్సిందన్నారు.

కొత్త వ్యవసాయ బిల్లులు రైతులకు వరం లాంటివని అభివర్ణించారు జావడేకర్​. రబీ పంటలకు ప్రభుత్వం ఎంఎస్​పీలను పెంచిందని.. వాటిని సేకరిస్తుందన్నారు. రైతులు తమ పంటను అధిక ధరకు అమ్ముకొనే అవకాశం కల్పిస్తుందన్నారు.

ఇదీ చూడండి: ట్రాఫిక్​ ఉల్లంఘనులకు వారంలోనే రూ.21 కోట్ల జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.