వ్యవసాయ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన క్రమంలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. బిల్లుపై చర్చ సందర్భంగా వారి ప్రవర్తనను పలువురు కేంద్ర మంత్రులు తీవ్రంగా తప్పుపట్టారు. విపక్షాల తీరు సిగ్గుచేటుగా అభివర్ణించారు. పార్లమెంటు చరిత్రలో ఇలాంటి సంఘటన ఎన్నడూ చూడలేదని తెలిపారు మంత్రులు.
రాజ్యసభలో చెలరేగిన గందరగోళంపై మీడియా సమావేశం నిర్వహించి ప్రతిపక్షాలపై మండిపడ్డారు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రకాశ్ జావడేకర్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, థావర్ చంద్ గెహ్లోత్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రవర్తన ఊహించలేదన్నారు రాజ్‌నాథ్ సింగ్.
"ప్రతిపక్ష నేతలు రూల్ బుక్‌ను చించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పోడియం వైపు పేపర్లు విసిరారు. టేబుళ్ల పైకి ఎక్కారు. ఇలాంటి చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు. హరివంశ్ విలువలకు కట్టుబడి ఉన్నారు. ఛైర్మన్ నిర్ణయంపై ప్రతిపక్షాలు సంతృప్తి చెందకపోతే.. ఆయనపై దాడి చేసేందుకు, హింసాత్మకంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తారా?"
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి.
ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్.. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించడం, కేంద్ర మంత్రి పదవికి ఆ పార్టీ నేత హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేయడంపై స్పందించారు రాజ్‌నాథ్. అలాంటి నిర్ణయాల వెనక రాజకీయ కారణాలు ఉంటాయని, దానిపై మాట్లాడదలచుకోలేదన్నారు. అలాగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై.. ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
రైతులకు భరోసా..
వ్యవసాయ బిల్లులపై రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు రాజ్‌నాథ్. తానుకూడా రైతునేనని, కనీస మద్దతుధర, ఏపీఎంసీ కొనసాగుతుందని భరోసా కల్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటిని తొలిగించటం జరగదని స్పష్టం చేశారు.
-
#WATCH I am also a farmer and I want to assure farmers of the country that MSP (minimum support price) & APMC (agricultural produce market committee) systems are not going to end: Defence Minister Rajnath Singh on #AgricultureBills pic.twitter.com/fFdI0AsuKs
— ANI (@ANI) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH I am also a farmer and I want to assure farmers of the country that MSP (minimum support price) & APMC (agricultural produce market committee) systems are not going to end: Defence Minister Rajnath Singh on #AgricultureBills pic.twitter.com/fFdI0AsuKs
— ANI (@ANI) September 20, 2020#WATCH I am also a farmer and I want to assure farmers of the country that MSP (minimum support price) & APMC (agricultural produce market committee) systems are not going to end: Defence Minister Rajnath Singh on #AgricultureBills pic.twitter.com/fFdI0AsuKs
— ANI (@ANI) September 20, 2020
ఇదీ చూడండి: