అయోధ్యలో రామాలయాన్ని పూర్తిగా రాళ్లతోనే నిర్మిస్తామని మందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. వెయ్యేళ్లయినా ఎలాంటి వాతావరణానికి అయిన చెక్కుచెదరకండా ఉండేలా నిర్మిస్తామని స్పష్టం చేశారు. మందిర నిర్మాణంలో పలు రంగాల నిపుణులు పాలుపంచుకున్నట్లు వెల్లడించారు.
ఐఐటీ- మద్రాస్, కేంద్ర భవనాల పరిశోధన సంస్థ (సీబీఆర్ఐ) వంటి సంస్థలు ఇందులో ఉన్నట్లు రాయ్ పేర్కొన్నారు రాయ్. మందిర నిర్మాణాన్ని లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్&టీ) చేపట్టనుండగా.. ఐఐటీ- మద్రాసు నిపుణులు భూమి పరీక్షలు చేయనున్నారు.
భూకంపాలను తట్టుకునేలా..
మందిర నాణ్యతను సీబీఆర్ఐ పరీక్షించనున్నట్లు రాయ్ తెలిపారు. భారీ భూకంపాలను తట్టుకుని నిలబడి ఉండేలా ఆలయాన్ని నిర్మించటంలో సీఆర్బీఐ సహకరించనుందని చెప్పారు.
మందిర నిర్మాణానికి సుమారు 10 వేల రాగి కడ్డీలు అవసరమని తెలుస్తోంది. మందిర నిర్మాణంలో భాగం కావాలనుకునేవారు రాగిని విరాళంగా ఇవ్వాలని రాయ్ కోరారు.
ఇదీ చూడండి: ఐక్యతా విగ్రహానికి రక్షణగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది