దిల్లీలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని భావిస్తున్నట్లు దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అభిప్రాయపడ్డారు. అయితే దానిని కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్ ) మాత్రమే నిర్ధరించగలవని అన్నారు.
"దిల్లీ సహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారంటే.. అక్కడ సామాజిక వ్యాప్తి జరుగుతోందని మనం అంగీకరించాలి. కానీ అది సాంకేతికతకు సంబంధించిన విషయం కాబట్టి.. కేంద్రం లేదా ఐసీఎంఆర్ మాత్రమే దానిని నిర్ధరించగలవు. గత 40 రోజుల్లో దిల్లీలో కేసులు రెండు రెట్లు పెరిగాయి"
--సత్యేంద్ర జైన్, దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి
దిల్లీలో రోజూ కరోనా వైరస్ కేసులు 4వేలకుపైగా నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 38వేలు దాటింది. ఇప్పటివరకు దిల్లీలో మొత్తం వైరస్ బారిన పడి 4,907 మంది మృతి చెందారు.