ETV Bharat / bharat

సర్కారీ ఉద్యోగం ఏదైనా ఇకపై ఒకటే పరీక్ష!

కేంద్రప్రభుత్వ ఉద్యోగం ఏదైనా ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేసే విధానం అమలుపై ఎన్డీఏ సర్కార్​ కసరత్తు చేస్తోంది. నియామక ప్రక్రియ ముసాయిదా వివరాలను సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Only 1 agency to do majority of public sector recruitment through single exam: Centre
సర్కారీ ఉద్యోగం ఏదైనా ఇకపై ఒకటే పరీక్ష!
author img

By

Published : Dec 3, 2019, 7:41 PM IST

ప్రభుత్వ ఉద్యోగం కోసం వివిధ పరీక్షలు రాసే అభ్యర్థులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఒకే ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల నియామకం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించింది.

కామన్​ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా గ్రూప్​-బి, గ్రూప్-సి ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

"గ్రూప్​-బి, నాన్​ గెజిటెడ్​ పోస్టులతో పాటు గ్రుప్​-బి గెజిటెడ్ పోస్టులు, గ్రూప్-సి పోస్టులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్​ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేసే విధంగా ఒక ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం."
-సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గ్రూప్​-బి, సి లతో పాటు వాటికి సమానమైన ఖాళీలను సైతం ప్రత్యేక ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది కేంద్రం.

ఇదీ పరీక్ష విధానం..

ప్రస్తుతం ఐబీపీఎస్​, ఆర్​ఆర్​బీ, ఎస్​ఎస్​సీ నిర్వహిస్తున్న పరీక్షలకు... కామన్​ ఎలిజిబిలిటీ టెస్ట్​లో విద్యార్హత ఆధారంగా పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియెట్(12వ తరగతి), పదో తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
పరీక్షలో వచ్చిన మార్కులను అభ్యర్థులకు తెలియజేస్తారు. ఈ మార్కులను ఆయా ఏజెన్సీ(ఐబీపీఎస్, ఆర్​ఆర్​బీ, ఎస్​ఎస్​సీ)లకు అందిస్తారు.

మార్కులు మెరుగుపర్చుకోవడానికి ప్రతి అభ్యర్థికి మరో రెండు అవకాశాలు ఇస్తారు. వీటన్నింటిలో ఎక్కువ ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటినే తుది ఫలితంగా పరిగణిస్తారు. ఈ మార్కులు మూడేళ్ల వరకు చెల్లుబాటు అయ్యేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

తుది ఎంపిక మాత్రం ఆయా ఏజెన్సీ(ఐబీపీఎస్​, ఆర్​ఆర్​బీ)లు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షల ద్వారా ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సైతం ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు ఆధారంగా చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. దీని ద్వారా భర్తీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించవచ్చని పేర్కొంది.

6.8లక్షల ఖాళీ ఉద్యోగాలు

ప్రభుత్వ గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖలలో 6,83,823 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 5,74,289 గ్రూప్​-సి పోస్టులు కాగా... 89,638 పోస్టులు గ్రూప్​-బీలో ఖాళీగా ఉన్నాయి. గ్రూప్​-ఎ కేటగిరీలో 19,896 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

అభ్యర్థులకు మేలు

ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో ఉద్యోగానికి ఒకటికంటే ఎక్కువ రౌండ్ల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఇబ్బంది కొత్త విధానంతో తగ్గనుంది. అభ్యర్థులు అన్ని పరీక్షలకు దరఖాస్తు రుసుం చెల్లించే బాధ తొలగిపోనుంది.

ఏటా దాదాపు 1.25 లక్షల ఉద్యోగాలకు 2.5కోట్ల మంది పోటీ పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kabul – 3 December 2019
1. German Defence Minister Annegret Kramp-Karrenbauer and Afghan President Ashraf Ghani walking to lecterns
2. Kramp-Karrenbauer and Ghani at lecterns
3. Mid of Afghan officials
4. Close of photographer
5. SOUNDBITE (German) Annegret Kramp-Karrenbauer, German Defence Minister:
"We very much hope that the free and peaceful (Afghan) presidential elections will now quickly lead to a result that will be transparent and accepted by all. ++SHE WAITS FOR TRANSLATOR ON LOCATION++ And that with a strong Afghan government the peace talks will then be able to proceed. We are of the opinion that peace talks and a peace agreement must definitely involve Afghan politics and Afghan leaders."
6. Various of Kramp-Karrenbauer and Ghani at news conference
7. SOUNDBITE (Dari) Ashraf Ghani, Afghan President:
"I request that you convey the deepest condolences and appreciations of the Afghan nation to the families of those 58 soldiers and officers who sacrificed their lives and blood for global security and our freedom."
8. Close of video cameras
9. Kramp-Karrenbauer and Ghani shaking hands and leaving
STORYLINE:
German Defence Minister Annegret Kramp-Karrenbauer on Tuesday arrived in Kabul on an unannounced trip, where she emphasised that the outcome of the recent presidential election is crucial in moving forward Afghan peace talks with the Taliban.
During her visit, Kramp-Karrenbauer met with Afghan President Ashraf Ghani and reassured the German government's commitment to Afghanistan in fields including the security sector.
Ghani thanked Germany for their support of the Afghan government and conveyed the nation's appreciation for the sacrifices German armed forces have made in Afghanistan.
Over 1,000 German troops are stationed in Afghanistan, mainly in the northern part of the country, serving with a mission that launched in 2015 to train and assist Afghan security and defence forces.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.