ETV Bharat / bharat

ఉల్లి ధరలు కొద్దిరోజుల్లోనే దిగొస్తాయి: కేంద్రం

విపరీతంగా పెరిగిపోతున్న ఉల్లిపాయల ధరలను త్వరలోనే అదుపులోకి తీసుకొస్తామని కేంద్రం స్పష్టంచేసింది. నాఫెడ్​ లాంటి ఏజెన్సీల ద్వారా ఉల్లి సరఫరా పెంచుతామని చెప్పింది. కృత్రిమ కొరత సృష్టించకుండా చూసేందుకు అవసరమైతే వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వలపై పరిమితి విధిస్తామని తెలిపింది.

ఉల్లి ధరలు కొద్దిరోజుల్లోనే దిగొస్తాయి: కేంద్రం
author img

By

Published : Sep 24, 2019, 4:12 PM IST

Updated : Oct 1, 2019, 8:15 PM IST

సామాన్యులకు అందనంత స్థాయిలో ఉన్న ఉల్లిపాయల ధరలు త్వరలోనే దిగివస్తాయని చెప్పారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్​ తోమర్​. నాఫెడ్​ లాంటి ఏజెన్సీల ద్వారా ఉల్లిపాయల సరఫరా పెంచుతామని ఆయన వెల్లడించారు. రైతుల కోసం రెండు మొబైల్​ యాప్​లను దిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉల్లి పరిస్థితులపై ప్రభుత్వానికి అవగాహన ఉందని... రైతుల, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తోమర్ స్పష్టం చేశారు.

"మరికొద్ది రోజుల్లో ఉల్లిపాయల ధరలు దిగివస్తాయి.​ నాఫెడ్​ తన వద్ద ఉన్న అదనపు నిల్వలను తక్కువ ధరకే సరఫరా చేస్తుంది. వ్యవసాయశాఖ వద్ద తగినంత స్థాయిలో ఉల్లి నిల్వలు ఉన్నాయి."
- నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

ప్రస్తుతం నిల్వ ఉన్న ఉల్లిపాయలు అమ్ముడవుతున్నాయని, నవంబర్​ నాటికి కొత్త పంట మార్కెట్​లో వస్తుందని తోమర్​ పేర్కొన్నారు.

నిల్వలపై పరిమితులు

ఉల్లి ధరల నియంత్రణకు తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్​ విలాస్ పాసవాన్ స్పష్టంచేశారు. అవసరమైతే వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వలపై పరిమితులు విధిస్తామని చెప్పారు.

వరదలతో ఉల్లి మంట...

వర్షాలు, వరదల కారణంగా మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా నెల రోజులుగా ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కేజీ ఉల్లి ధర రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది.

ఇదీ చూడండి: లాభాల స్వీకరణతో బుల్​ జోరుకు బ్రేక్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in
contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Kamaishi, Japan - 24th September 2019.
1. ++SHOTLIST TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: World Rugby
DURATION: 03:02  
STORYLINE:
Fiji head coach John McKee and captain Dominiko Waqaniburotu spoke to the media on Tuesday, ahead of their second Rugby World Cup game against Uruguay at the Kamaishi Recovery Memorial Stadium.  
McKee has rung the changes as Fiji look to get off the mark in Pool D against minnows Uruguay, naming just three players from the team that started last Saturday's 39-21 defeat by Australia and will give World Cup debuts to Mesulame Dolokoto, Jale Vatubua and Filipo Nakosi.
Fiji won 47-15 in 2015 in their only previous World Cup encounter with Uruguay, who have the youngest average squad in the tournament at 26 years and 79 days.
Last Updated : Oct 1, 2019, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.