జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. పుల్వామా జిల్లాలోని నూర్పురా, అవంతిపురా ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా తనిఖీ చేపట్టాయి.
ఈ సమయంలో భద్రతా దళాలకు తారసపడిన ఉగ్రవాది.. వారిపైకి కాల్పులకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:'స్వార్థ ప్రయోజనాల కోసం భారత్ యుద్ధం చేయదు'