ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దులో మరో రైతు మృతి

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. సింఘూ సరిహద్దు వద్ద ఉన్న కాలువలో పడి కన్నమూసినట్టు తెలుస్తోంది. ఆ రైతును పంజాబ్​వాసిగా గుర్తించారు.

one more farmer died at singhu border protesting against agriculture laws
దిల్లీ సరిహద్దులో మరో రైతన్న మృతి
author img

By

Published : Dec 17, 2020, 1:24 PM IST

దిల్లీలో నిరసనలు చేపట్టిన రైతులకు మరో చేదు వార్త అందింది. దిల్లీ-హరియాణా సింఘూ సరిహద్దు వద్ద మరో అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని పంజాబ్​కు చెందిన భీమ్​ సింగ్​గా గుర్తించారు.

అయితే ఈయన సింఘూ సరిహద్దు వద్ద ఉన్న ఓ కాలువలో పడి మరణించినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పంచనామా కోసం అసుపత్రికి తరలించారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 22 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. చట్టాలను ప్రభుత్వం రద్దు చేసి తీరాల్సిందేనని డిమాండ్​ చేస్తున్నారు. కానీ తాము చట్టాలను ఉపసంహరించుకోమని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు ఉద్ధృతం చేశారు.

ఇదీ చూడండి:- 'రైతుల నిరసనను నీరుగార్చే చర్చలు ఆపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.