ETV Bharat / bharat

'దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా' - కొవిడ్ 19 తాజా వార్తలు

దేశంలో కరోనా వైరస్​ పరిస్థితిపై ఐసీఎంఆర్​ రెండోసారి సెరో సర్వే నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ మురికివాడల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని తేలింది. రాబోయే పండుగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది.

ICMR
కరోనాపై రెండో సెరో సర్వే- పట్టణ ప్రాంతాల్లోనే ముప్పు
author img

By

Published : Sep 29, 2020, 5:46 PM IST

Updated : Sep 29, 2020, 7:29 PM IST

కరోనా ప్రభావం దేశ జనాభాపై ఇంకా అధికంగానే ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్) చేసిన రెండో సెరో సర్వేలో తేలింది. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ కరోనా మరణాల విషయంలో భారత్​ అందరికంటే మెరుగ్గా ఉందని ఐసీఎంఆర్ తెలిపింది.

10 లక్షల మందిలో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి టెస్టింగ్​ సామర్థ్యం పెరిగినట్లు ఐసీఎంఆర్​ స్పష్టం చేసింది. సెప్టెంబర్​లో మొత్తం 2.97 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.

సెరో సర్వే విషయాలు...

  • 10 ఏళ్లు దాటిన ప్రతి 15 మందిలో ఒకరు 2020 ఆగస్ట్​ నాటికి కరోనాతో బాధపడుతున్నట్లు అంచనా.
  • గ్రామీణ ప్రాంతాల (4.4%)తో పోలిస్తే అర్బన్ స్లమ్ (15.6%)​, అర్బన్ నాన్ స్లమ్ (8.2%) ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది.
  • ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్​ 22 వరకు 29,082 మందిపై సర్వే చేయగా అందులో 6.6 శాతం మంది అప్పటికే కరోనా బారిన పడ్డారు.
  • గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ మురికివాడల్లో కరోనా వ్యాప్తి 4 రెట్లు అధికంగా ఉంది. నాన్​ స్లమ్​ ప్రాంతాలతో పోలిస్తే రెండు రెట్లు అధికం.

ఐదు 'టీ' లతో చెక్..

కరోనా బారి నుంచి రక్షించేందుకు 5'టీ'(టెస్ట్​, ట్రేక్, ట్రేస్, ట్రీట్, టెక్నాలజీ) సూత్రాన్ని ఐసీఎమ్​ఆర్​ సూచించింది. వీటితో కరోనాను సమర్థంగా ఎదుర్కోవచ్చని విశ్వాసం వ్యక్తం చేసింది.

అయితే రాబోయే పండుగ కాలంలో వైరస్​ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. ప్రజలు గూమిగూడకుండా రాష్ట్రాలు మరింత శ్రద్ధగా కరోనా నియమాలు పాటించేలా చేయాలని సూచించింది.

Last Updated : Sep 29, 2020, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.