భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా అధికార ఎన్డీఏ ప్రకటించనుందని సమాచారం. రాజస్థాన్లోని కోటా-బుండి లోక్సభ స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుపొందారు.
ఎన్డీఏకి లోక్సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నందున ఆ కూటమి ప్రతిపాదించే అభ్యర్థే సునాయసంగా గెలుపొందుతారు. ఒకవేళ వేరే పార్టీలు అభ్యర్థిని పోటీకి దింపితే ఎన్నిక బుధవారం జరుగుతుంది.
ఇదీ చూడండి : భాజపా తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా