నీతి ఆయోగ్‌కు చెందిన ఓ అధికారికి కరోనా సోకింది. దీంతో దిల్లీలోని సంస్థ భవనాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
"నీతి ఆయోగ్‌లో పని చేసే డైరెక్టర్ స్థాయి అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు వైద్య పరీక్షల ఫలితం వెలువడిన తర్వాత ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందించాము. అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తూ, 48 గంటలు పాటు నీతి ఆయోగ్ భవనాన్ని మూసివేస్తున్నాం."
-అలోక్ కుమార్, నీతి అయోగ్ సలహాదారు
ఆ అధికారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు వెల్లడించారు అలోక్.
ఇటివల విమానయాన మంత్రిత్వ శాఖలో పని చేసే ఉద్యోగికి కరోనా సోకిన కారణంగా ఆ శాఖ ప్రధాన కార్యాలయాన్నీ ఇలానే మూసివేశారు.