నిబంధనలను ఉల్లంఘించారని ఓ ఐఏఎస్ అధికారిపై వేటు వేసింది ఎన్నికల సంఘం. ఒడిశా సంబల్పుర్లో ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న అధికారి.. ప్రధాని నరేంద్రమోదీ వాహన శ్రేణితో పాటు హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు.
ప్రత్యేక రక్షణ దళ(ఎస్పీజీ) సిబ్బందికి తనిఖీల నుంచి మినహాయింపు ఉంది. నిబంధనలు పాటించకుండా తనిఖీలు చేయటం ఉల్లంఘనేనని ఈసీ వ్యాఖ్యానించింది.
సంబల్పుర్లో మంగళవారం జరిగిన బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ వాహన శ్రేణిని సాధారణ పరిశీలకుడు మహ్మద్ మోసీన్ తనిఖీ చేయటంపై ఈసీ చర్యలు తీసుకుంది.
ఈ విషయంపై విచారణకు ఎన్నికల ఉప కమిషనర్ ధర్మేంద్ర శర్మను సీఈసీ సునీల్ అరోడా నియమించారు. రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
2014 ఏప్రిల్ నాటి నిబంధనల ప్రకారం ప్రధాన మంత్రితో పాటు ఎస్పీజీ సిబ్బందికి తనిఖీల నుంచి మినహాయింపు ఉంది.
ఇదీ చూడండి: సీఎం హెలికాప్టర్ తనిఖీ చేసిన అధికారులు