ETV Bharat / bharat

ఆన్​లైన్​ డేటింగ్​ ముచ్చట్లలో మహిళలదే పైచేయి - corona latest impact on dating apps

లాక్​డౌన్​ వేళ ఆన్​లైన్​ డేటింగ్ యాప్స్​ను వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే 'క్వాక్​క్వాక్'​ అనే డేటింగ్​ యాప్​ అందించిన నివేదికలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. చాటింగ్​ విషయంలో.. పురుషులు సగటున 10 మందితో సంభాషిస్తుంటే.. మహిళలు 25 మందితో ముచ్చట్లు పెడుతున్నారట.

Of 100 profile views, female user likes only 4, skips 96, says dating app
లాక్​డౌన్​: ఆన్​లైన్​ డేటింగ్​ ముచ్చట్లలో మహిళలదే పైచేయి
author img

By

Published : May 14, 2020, 3:44 PM IST

ప్రస్తుతం అమ్మాయి ్యఅయినా, అబ్బాయి అయినా.. నచ్చిన వారితో డేటింగ్​ చేయడానికి ఎంచుకుంటున్న పద్దతి ఆన్​లైన్​. ప్రధానంగా ఇందుకు సంబంధించిన యాప్స్​ గూగుల్​ ప్లే స్టోర్​లో కోకొల్లలుగా అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే లాక్​డౌన్​ వేళ.. వీటి వినియోగంపై నిర్వహించిన ఓ అంతర్గత సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆన్​లైన్​ డేటింగ్​కు ప్రఖ్యాతి గాంచిన 'క్వాక్​క్వాక్' యాప్​ అందించిన నివేదిక ప్రకారం.. 100లో 35 ప్రొఫైల్స్​కు పురుషులు లైక్​ కొడుతుండగా.. మగిలిన 65 ప్రొఫైల్స్​ను స్కిప్​ చేస్తున్నారట. అదే మహిళలైతే ..కేవలం 4 ప్రొఫైల్స్​నే ఇష్టపడుతున్నారు. మిగిలిన 96డీపీలను స్కిప్​ చేస్తున్నట్లు సర్వే వెల్లడించింది.

ఫొటోల​ అప్​లోడ్​లో భయాందోళన..

చాటింగ్​ విషయానికొస్తే.. పురుషులు సగటున 10మందితో సంభాషిస్తుంటే.. మహిళలు 25మందితో ముచ్చట్లు పెడుతున్నట్లు పేర్కొంది సర్వే. అంతేకాకుండా.. 60 శాతం మంది ప్రొఫైల్​ను క్రియేట్​ చేసే సమయంలోనే వారి ఫొటోలను కూడా అప్​లోడ్​ చేస్తున్నారు. మిగిలిన 40 శాతం.. ఈ విషయంలో భయాందోళనకు గురవుతున్నట్టు స్పష్టం చేసింది.

లాగ్​ఇన్​లోనూ మహిళలే..

ఇక భారత్​లో పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటున్న పురుషులు.. రోజులో యాప్​ను 20సార్లు లాగ్​ఇన్​ అవుతుంటే.. మహిళలు 26 సార్లు తమ అకౌంట్​కు లాగ్​ఇన్​ అవుతున్నారు.

క్వాక్​క్వాక్​ యాప్​ను కేవలం 97రోజుల్లో 9మిలియన్ల మంది భారతీయులు డౌన్​లోడ్​ చేసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. లాక్​డౌన్​ ప్రకటించిన అనంతరం.. కొత్తగా 18వేల మంది తమ యాప్​ను వినియోగించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. క్వాక్​క్వాక్​ యాప్​ను వినియోగిస్తున్నవారిలో 40 శాతం మంది మట్రోపాలిటిన్​ నగరాలకు చెందగా.. టైర్​2, 3 నగరాల నుంచి 60 శాతం యూజర్లు ఉన్నట్లు సంస్థ వివరించింది.​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.