తన భర్త వైద్య చికిత్స ఖర్చుల కోసం కన్నకొడుకును తాకట్టు పెట్టిన దయనీయ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా పరిధి భంజ్నగర్లో జరిగింది. 5 నెలల కుమారుడిని సొంత అక్కకు రూ .10,000కు తనఖా పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తలకిందులైన బతుకు..
జిలీ నాయక్ భర్త దుఖా నాయక్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటినుంచి ఇంటికే పరిమితమయ్యాడు. సరైన చికిత్స లేక ఆ గాయం తీవ్రత ఎక్కువైంది. అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలోనే తన బాబును తాకట్టు పెట్టవలసి వచ్చిందని వివరించింది జిలీ.
కాలి గాయం ఎంతకూ మానట్లేదని.. మెరుగైన చికిత్స కోసం డబ్బు లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని దుఖా నాయక్ వాపోయాడు.
ఇదీ చదవండి: పురిటి నొప్పులతోనే నదిని దాటి ప్రసవం!