10 అడుగుల మొసలిని కొందరు యువకులు చంపిన ఘటన ఒడిశాలోని కల్డపల్లి గ్రామంలో జరిగింది. అనంతరం వంట కోసం ఆ మొసలి మాంసాన్ని గ్రామ ప్రజలకు పంచిపెట్టారు.

చెట్టుకు కట్టేసి...
ఒడిశా మల్కన్‌గిరి జిల్లాలోని పడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్డపల్లికి చెందిన యువకులు గ్రామ సమీపంలోని నదిలో 10 అడుగుల మొసలిని గుర్తించారు. దాన్ని తీసుకొచ్చి గ్రామంలోని ఓ చెట్టుకు వేలాడదీశారు. అనంతరం దాని మాంసాన్ని గ్రామస్థులకు పంచిపెట్టారు.

ఈ ఘటనపై దర్యాప్తు జరపడానికి మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ మిరాసి తెలిపారు.

ఇదీ చూడండి:- బావిలో విషవాయువు.. నలుగురు మృతి