దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించేందుకు 950 పడకల సామర్థ్యం కలిగిన రెండు ప్రైవేట్ ఆస్పత్రులతో గురువారం కీలక ఒప్పందం చేసుకుంది. చికిత్స అందించేందుకు భువనేశ్వర్‌కు చెందిన కేఐఐఎంఎస్, ఎస్యూఎం ఆస్పత్రులు ఏప్రిల్ 15లోపు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు.
కరోనా బాధితులకు అత్యాధునిక వైద్యం అందించేలా ఆస్పత్రులు ఉండాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. ఒడిశా మైనింగ్ కార్పొరేషన్, మహానంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ అందజేసిన సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులతో ఈ ఒప్పందం కుదుర్చకుంది.
ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది నవీన్ పట్నాయక్ సర్కార్.