ETV Bharat / bharat

కరోనాతోనే అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

ఒడిశా ఎమ్మెల్యే ఉమాకాంత సామంత్​రాయ్​పై అంటువ్యాధుల నివారణచట్టం కింద కేసు నమోదైంది. కరోనా పాజిటివ్​ వచ్చినా నిబంధనలను ఉల్లంఘించి బీజేడీ నాయకుడు ప్రదీప్ మహారథి అంత్యక్రియల్లో పాల్గొన్నందున ఆయనపై కేసు నమోదు చేశారు.

author img

By

Published : Oct 10, 2020, 5:28 PM IST

Updated : Oct 10, 2020, 6:12 PM IST

ODISHA-MLA-BOOKED-FOR -VIOLATION-OF -COVID RULES
కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కేసు

కరోనా నిబంధనలను ఉల్లంఘించిన బీజేడీ ఎమ్మెల్యే ఉమాకాంత సామంత్​రాయ్​పై కేసు నమోదైంది. కరోనా పాజిటివ్​గా తేలినా ఐసోలేషన్​లో ఉండకుండా బీజేడీ నాయకుడు ప్రదీప్​ మహారథి అంత్యక్రియల్లో పాల్గొనటంపై విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా సోకిన మరో ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్​ రంజన్​​పై మాత్రం ఎలాంటి కేసు నమోదు కాలేదు. క్వారంటైన్​ ప్రోటోకాల్​ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి.

'వారికి కరోనా ఉంది'

సమీర్​​, సామంత్​రాయ్​ ఇద్దరు ఎమ్మెల్యేలకూ అసెంబ్లీ సమావేశాల ముందు కరోనా నిర్ధరణ అయ్యింది. సెప్టెంబర్​ 12న సమీర్​, సెప్టెంబర్​ 28న ఉమాకాంత వైరస్​ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో.. ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానిక నాయకుడు జగన్నాథ్.

వీడియోలో క్షమాపణ..

నిబంధనలను ఉల్లంఘించి అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు ఉమాకాంత సామంత్​రాయ్ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు. మహారథితో ఉన్న అనుబంధం వల్లే అంత్యక్రియల్లో పాల్గొన్నానని తెలిపారు.

క్వారంటైన్​ పూర్తయ్యాకే బయటకు..!

mla umakant samanthroy
ఎమ్మెల్యే ఉమాకాంత సామంత్​రాయ్, మంత్రి సమీర్​

17రోజులు క్వారంటైన్​లో ఉన్న తర్వాతే మంత్రి సమీర్​ రంజన్​ బయటకు వచ్చారని.. అందుకే కేసు నమోదు చేయలేదని పూరీ ఎస్​పీ అఖిలేశ్వర్​ సింగ్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : బిహార్​ బరి: తేజస్వీ ఓటమే లక్ష్యంగా భాజపా వ్యూహం

Last Updated : Oct 10, 2020, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.