ETV Bharat / bharat

రూపాయి నాణేలపై గణపతి, బుద్ధుడి సూక్ష్మ చిత్రాలు! - ఒడిశాకు చెందిన సూక్ష్మ చిత్రకారిణి రూపాయి

ఒడిశాకు చెందిన ఓ సూక్ష్మ చిత్రకారిణి రూపాయి నాణేలపై చిన్న చిన్న బొమ్మలను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. గణపతి, బుద్ధుడు, సూర్యుడు, చంద్రుడు.. ఇలా సుమారు 100కుపైగా చిత్రాలను గీసి... తన ప్రపంచ రికార్డును తానే తిరగరాశారు.

odisha-micro-artist-draws-miniature-paintings-on-coin-sets-world-record
రూపాయి నాణెలపై గణపతి, బుద్ధుడి సూక్ష్మ చిత్రాలు!
author img

By

Published : Feb 14, 2020, 7:40 AM IST

Updated : Mar 1, 2020, 7:07 AM IST

రూపాయి నాణేలపై గణపతి, బుద్ధుడి సూక్ష్మ చిత్రాలు!

ఒడిశాకు చెందిన సూక్ష్మ చిత్రకారిణి గాయత్రి..​ నాణేలపై అందమైన బొమ్మలు వేస్తూ అద్భుతాలు చేస్తున్నారు. తన నైపుణ్యంతో నాణేలపై అత్యంత సూక్ష్మమైన చిత్రాలు​ వేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. అంతేకాదు తన ప్రతిభతో పలు రికార్డులు కొల్లగొడుతున్నారు.

రూపాయి నాణెం మీద వేసిన చూడముచ్చటైన బొమ్మలకు 'అసాధారణ సూక్ష్మ చిత్రాల' విభాగంలో ప్రపంచ రికార్డు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశం తరఫున అవార్డు తీసుకున్నారు.

రూపాయి నాణేల వెనకవైపు సూక్ష్మ చిత్రాలు గీయడంలో తనకు తానే సాటి అని అనిపించుకుంటున్నారు గాయత్రి. ఇప్పటివరకు 100 నాణేలపై వివిధ రకాల పెయింటింగు​లు వేశారు. గణపతి, బుద్ధుడు, కోయి ఫిష్, తలుపులు, పుష్పాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, సీతాకోక చిలుకలు, పడవలు, ఓడలు... ఒక్కటేమిటి... తన కుంచె నుంచి జాలువారని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు.

తెలుగింటి ఆడపడుచే..

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నానికి చెందిన గాయత్రి... చాలా కాలం నుంచి ఒడిశాలో నివసిస్తున్నారు. ఒక్కో చిత్రం రూపొందించడానికి దాదాపు గంట సమయం పడుతుందని ఆమె చెబుతున్నారు. తన పని పట్ల చాలా సంతృప్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. తన కొడుకు దగ్గరి నుంచి ఓ నాణెం తీసుకొని పెయింటింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. అప్పటి నుంచి తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ వస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమరులకు 'స్మారక చిహ్నం'

Last Updated : Mar 1, 2020, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.