ETV Bharat / bharat

పీజీ పట్టభద్రుడి భిక్షాటన.. ఎందుకో తెలుసా?

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న కల నేరవేరలేదన్న మానసిక క్షోభతో ఓ వ్యక్తి యాచించే స్థితికి చేరుకున్నాడు. మతిస్థిమితం కోల్పోయి ఒడిశాలోని పూరి నగరంలో భిక్షాటన చేస్తూ కనిపించాడు. మీడియా కథనాల్లో అతడి పరిస్థితి గుర్తించి తెలుసుకున్న స్నేహితులు.. ఆస్పత్రిలో చేర్పించారు.

Odisha
ఒడిశా
author img

By

Published : Feb 23, 2020, 10:38 PM IST

Updated : Mar 2, 2020, 8:31 AM IST

ఎకనామిక్స్​లో పీజీ పట్టా పొంది భిక్షాటన.. కారణమేంటీ?

శ్రీజిత్​ పాధి.. ఎకనామిక్స్​లో పీజీ పట్టా పొందాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో కలలు కన్నాడు. అందుకు తగ్గట్లుగానే సన్నద్ధమై.. ఒడిశా అడ్మినిస్ట్రేటివ్​ సర్వీస్​ (ఓఏఎస్​) పరీక్షలో రెండు సార్లు ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఆయనను రెండు సార్లు విధి వక్రీకరించింది. ప్రాథమిక పరీక్షలో పాసైనప్పటికీ.. వైవా వాయిస్​ రౌండ్​లో విఫలమయ్యాడు.

ఉద్యోగం రాలేదని మానసికంగా కుంగిపోయాడు పాధి. చివరకు మతిస్థిమితం కోల్పోయి ఆధ్యాత్మిక క్షేత్రమైన పూరి నగరంలోని బడా దండ(గ్రాండ్ రోడ్) ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నాడు. పూరిలో యాచిస్తూ తిరుగుతున్న శ్రీజిత్​పై పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. విషయం తెలుసుకున్న అతని స్నేహితులు కటక్​లోని ఆస్పత్రిలో చేర్పించారు.

ఉన్నత విద్యార్హతలున్న శ్రీజిత్ 1989లో రావెన్‌షా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్​లో పీజీ పట్టా పొందాడు. ఆయన తండ్రి రైల్వే శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు.

నెల రోజుల క్రితం పూరిలోని బడా దండ రోడ్​లోనే మరొక వ్యక్తి ఇదే విధంగా యాచిస్తు కనిపించాడు. ప్లాస్టిక్ ఇంజినీరింగ్​లో డిప్లొమా చేసినట్లు తెలిసింది.

Last Updated : Mar 2, 2020, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.