ETV Bharat / bharat

జర జాగ్రత్త: దేశంలో విస్తరిస్తోన్న కరోనా వైరస్ - coronavirus latest news

కరోనా
corona
author img

By

Published : Mar 14, 2020, 5:51 PM IST

Updated : Mar 14, 2020, 11:25 PM IST

23:23 March 14

మహారాష్ట్రలో 31 కేసులు...

కరోనాతో మహారాష్ట్ర తీవ్ర స్థాయిలో సతమతమవుతోంది. గంటగంటకూ కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్థరణ అయ్యింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 31కి చేరింది.

21:43 March 14

కరోనా ఎఫెక్ట్​తో...

కరోనా వల్ల వాణిజ్య కేంద్రాలు, పాఠశాలలు, పర్యటక ప్రదేశాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో మైసూరు పాలెస్​ను రేపటి నుంచి ఈ నెల 22వరకు మూసివేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. 

మరోవైపు.. మహారాష్ట్రాలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే థియేటర్లు, పలు పాఠశాలు మూతపడ్డాయి. తాజాగా పరీక్షలపైనా కరోనా ప్రభావం పడింది. 1-9 తరగతుల పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే 10,12 తరగతుల పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది.

20:16 March 14

మరో వ్యక్తికి కరోనా?

భారత్​ను కరోనా వైరస్​ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. తాజాగా రాజస్థాన్​లోని 24ఏళ్ల వ్యక్తికి వైరస్​ సోకినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఇటీవలే స్పెయిన్​ నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. దీనితో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నలుగురికి కరోనా సోకింది.

19:52 March 14

రేపు సాయంత్రం...

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోన్న కరోనాపై సార్క్​ దేశాధినేతలు రేపు సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు. వైరస్​పై కలిసి పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్​ తరఫున వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఇందులో పాకిస్థాన్​ కూడా పాల్గొననుంది.

19:29 March 14

ఇటలీకి ఎయిర్​ ఇండియా

ఎయిర్​ ఇండియా విమానం.. దిల్లీ నుంచి ఇటలీలోని మిలాన్​కు బయలుదేరింది. అక్కడ ఉన్న దాదాపు 220 మంది ప్రయాణికులతో రేపు ఉదయం తిరిగి దిల్లీ చేరుకుంటుంది.

18:32 March 14

మరో ఇద్దరికి వైరస్​!

మహారాష్ట్రలో కరోనా వైరస్​తో మరో రెండు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. వీరు దుబాయ్​ నుంచి వచ్చినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

17:56 March 14

ఇరాన్​ నుంచి...

ఇరాన్​ నుంచి భారతీయులను వెనక్కి తీసుకొచ్చే విమానం.. రేపు అర్ధరాత్రికల్లా స్వదేశానికి చేరుకుంటుందని చెప్పారు. ఇటలీలో ఉన్న భారత విద్యార్థులను తీసుకురావడానికి ఎయిర్​ఇండియా విమానాన్ని శనివారం పంపించనున్నట్లు పేర్కొన్నారు.

17:30 March 14

దేశంలో కరోనా కలవరం- 85కు చేరిన కేసులు

భారత్​లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 85కి చేరింది. నాగ్​పుర్​లో మరో కేసు నమోదు కాగా... తెలంగాణలో ఒకరికి కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది.

నాగ్​పుర్​లో మరొకరు

నాగ్​పుర్​లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో మహారాష్ట్రలో కేసుల సంఖ్య 20కి చేరింది. వైరస్ సోకిన వ్యక్తిని నాగ్​పుర్​లోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు మరొక వ్యక్తితో కలిసి ఇటీవలే అమెరికా నుంచి భారత్​కు వచ్చినట్లు వెల్లడించారు. మరో వ్యక్తికి ఇదివరకే కరోనా సోకినట్లు స్పష్టం చేశారు. నాగ్​పుర్​లో ఇప్పటివరకు నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

85 మంది కరోనా బాధితులకు సంబంధం ఉన్న 4 వేల మందిని పరిశీలనలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. 

Last Updated : Mar 14, 2020, 11:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.