ETV Bharat / bharat

డోభాల్​ ఎంట్రీతో చైనా సరిహద్దులో మారిన లెక్కలు - అజిత్ డోభాల్​ వాంగ్ యూ చర్చలు

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన సహా సరిహద్దుల్లో శాశ్వత యథాపూర్వ స్థితి పునరుద్ధరణే లక్ష్యంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​, చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలని నిర్ణయించారు. వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక బలగాలను దశలవారీగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఓ అంగీకారానికి వచ్చారు.

NSA Doval holds talks with Chinese Foreign Minister to discuss restoration of peace
'సరిహద్దు విబేధాలను వివాదాలు మారనీయొద్దు!'
author img

By

Published : Jul 6, 2020, 3:58 PM IST

సరిహద్దు విభేదాలు వివాదాలుగా మారకుండా భారత్​-చైనా కృషి చేయాలని... భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్​ఎస్​ఏ) అజిత్ డోభాల్​, చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ ఓ అంగీకారానికి వచ్చారు. ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశమైన ఇరువురు నేతలు.. సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం ఈ చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు.

"ఇరువురు నేతలు వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన సహా సరిహద్దుల్లో శాశ్వత యథాపూర్వ స్థితి పునరుద్ధరణే లక్ష్యంగా చర్చలు జరిపారు. అలాగే భవిష్యత్​లో గల్వాన్ ఘర్షణ లాంటి పరిస్థితులు తలెత్తకుండా ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సరిహద్దుల నుంచి సైనిక బలగాలను దశలవారీగా.. పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరువురు ఓ అంగీకారానికి వచ్చారు."

- అధికార వర్గాలు

భారత్​-చైనా రెండూ వాస్తవాధీన రేఖను గౌరవించాలని... ఏ ఒక్కరూ వాస్తవాధీన రేఖ వెంబడి యథాపూర్వ స్థితిని మార్చే ప్రయత్నాలు చేయకూడదని అజిత్​ ఢోబాల్- వాంగ్ యీ నిశ్చయించారు.

కొద్ది గంటల్లోనే చైనా రివర్స్ గేర్​

డోభాల్​-వాంగ్​ యీ చర్చలు జరిపిన కొద్ది గంటలకే తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ నుంచి ఇరుదేశాల సైనిక బలగాలు వెనక్కి తగ్గుతున్నాయన్న వార్తలు వచ్చాయి.

"వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ లోయ సెక్టార్​లోని పెట్రోలింగ్ పాయింట్ 14, పీపీ-15, హాట్​ స్పింగ్స్​, ఫింగర్ ఏరియాల నుంచి (భారత్​-చైనా) ఇరుదేశాల సైనిక బలగాలు వెనక్కు మళ్లాయి."

- భారత సైన్యం

చైనా తమకు చెందిన వాహనాలు, గుడారాలను 1 నుంచి 2 కి.మీ మేర వెనక్కి తరలించింది. అయితే గల్వాన్ లోయ వెంబడి ఇప్పటికీ చైనా సాయుధ వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సరిహద్దు ఘర్షణ అనంతరం ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే జులై 1 చుషుల్​లో జరిగిన మూడో సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు... చైనా తన బలగాలను ఉపసంహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చూడండి: కశ్మీర్​ సైనిక వ్యూహం ఈశాన్యంలో ఫలిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.