ETV Bharat / bharat

ఎన్‌ఆర్‌సీలో 19.06 లక్షల మందికి దక్కని చోటు - NRC FINAL LIST

అసోం జాతీయ పౌర రిజిస్టర్ ​(ఎన్​ఆర్​సీ) తుది జాబితా విడుదలైంది. 3 కోట్ల 11లక్షల 21వేల నాలుగు మందికి జాబితాలో చోటు లభించింది. సరైన పత్రాలు సమర్పించని 19 లక్షల 6వేల 657 మంది పేర్లు జాబితాలో లేవు.

అసోం పౌర జాబితా విడుదల
author img

By

Published : Aug 31, 2019, 10:50 AM IST

Updated : Sep 28, 2019, 11:03 PM IST

ఎన్‌ఆర్‌సీలో 19.06 లక్షల మందికి దక్కని చోటు

71 ఏళ్లుగా నలుగుతున్న జాతీయ పౌర రిజిస్టర్ ​(ఎన్​ఆర్​సీ) విడుదలైంది. అసోం రాజధాని గువాహటిలోని ఎన్‌ఆర్‌సీ కేంద్ర కార్యాలయంలో తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. జాబితాలో తమ పేరు ఉందో లేదో అధికారిక వెబ్​సైట్​లో తనిఖీ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

అసోం జాతీయ పౌర రిజస్టర్​ తుది జాబితాలో 3కోట్ల 11లక్షల 21వేల నాలుగు మందికి చోటు లభించింది. సరైన పత్రాలు సమర్పించని కారణంగా 19 లక్షల 6వేల 657 మందిని జాబితాలో చేర్చలేదు.

జాబితాలో పేరు లేనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అధికారులు. కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలు కల్పించినట్లు వెల్లడించారు. అప్పీలు చేసుకునేందుకు ఉన్న గడువును 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. ప్రస్తుతమున్న 100 ఫారెనర్ ట్రైబ్యునళ్లకు అదనంగా మరో 200 ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రైబ్యునల్‌ తీర్పు వ్యతిరేకంగా వస్తే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించవచ్చని అధికారులు సూచించారు. నిజమైన అర్హులకు అన్యాయం జరగకుండా న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా చోటు దక్కిన వారికి ఆధార్ కార్డులు జారీ చేస్తామన్నారు.

New Delhi, Aug 31 (ANI): Namaste Pacific, a cultural gala was jointly hosted by the High Commissions of New Zealand, Australia, Papua New Guinea and Fiji at the New Zealand High Commission, Chanakyapuri in New Delhi. On display were the traditional masks and artifacts from Papua New Guinea and Pacific Green furniture and other products from Fiji. Members of the diplomatic community, government officials, business leaders, and cultural personalities were present at the event.
Last Updated : Sep 28, 2019, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.