ఉత్తరప్రదేశ్‌లో త్వరలో 11 స్థానాలకు జరగబోయే ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ తమ వైఖరి స్పష్టంచేశాయి. తాజాగా రాష్ట్రీయ లోక్‌దళ్ సైతం ఒంటరిగానే బరిలో దిగుతామని ప్రకటించింది.
"ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో రాష్ట్రీయ లోక్‌దళ్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఏది ఏమైనా చాలా ముందుగానే ఈ విషయంపై మాట్లాడాల్సి వచ్చింది. పార్టీ అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్, జయంత్ చౌదరి పోటీ చేసే స్థానాలపై త్వరలో ప్రకటిస్తారు."
-మసూద్ అహ్మద్, యూపీ ఆర్ఎల్డీ అధ్యక్షుడు
లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడ్డాయి ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ. అయితే ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. మహాకూటమిని బీఎస్పీ వీడాలనుకుంటే తాము ఒంటరిగా బరిలో దిగేందుకు సిద్ధమని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
ఇదీ చూడండి: 'ఎస్పీ-బీఎస్పీ మధ్య దూరం శాశ్వతం కాదు'