ETV Bharat / bharat

'ఖాతా లేకున్నా ఇకపై ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోలు చూడొచ్చు' - ఫేస్​ బుక్​

కరోనా వ్యాప్తితో లాడ్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫేస్​బుక్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఫేస్​బుక్​ ఖాతా ఉన్నవారు మాత్రమే ఆ ప్లాట్‌ఫామ్‌లో లైవ్​లను ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు ఖాతా లేని వారికి కూడా ఈ వెసులుబాటును అందించనుంది ఫేస్‌బుక్‌.

Now go live on Facebook without phone or an account
ఖాతా లేనివారూ త్వరలో ఫేస్​బుక్​లో లైవ్ ఇవ్వొచ్చు!
author img

By

Published : Mar 29, 2020, 6:15 PM IST

కొవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్​డౌన్ విధించాయి. ఈ సమయంలో ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోలకు డిమాండు భారీగా పెరిగింది. కరోనావైరస్‌ సమాచారం కోసం చాలా మంది ఈ లైవ్‌వీడియోలను చూస్తున్నారు. అయితే ఈ వీడియోలను ఫేస్‌బుక్‌ ఖాతాలేని వారు చూసేందుకు వీలుండేది కాదు. అయితే ఇప్పుడు ఖాతా లేకున్నా లైవ్‌ వీడియోలను వీక్షించేలా ఫేస్‌బుక్ సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

ఇప్పటికే డెస్క్‌టాప్‌ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్​ మొబైల్ యూజర్లకు తాజాగా అందుబాటులోకి వచ్చింది ఉంది. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది ఫేస్‌బుక్‌. మరో వారంరోజుల్లో ఐఓఎస్‌ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.

టోల్​ఫ్రీ నెంబర్​​ ద్వారా..

దీంతో పాటు పబ్లిక్​ స్విచ్​​ టెలీఫోన్ నెట్​వర్క్​అనే ఓ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెంబర్ ద్వారా లైవ్​స్ట్రీమ్​ల ఆడియోలు ఫోన్‌ద్వారా వినొచ్చు.

వీడియో క్వాలిటీ తగ్గింపు..

ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఫేస్​బుక్​ వినియోగం అధికమవుతోంది. 70 శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు గ్రూప్ వీడియో కాల్స్ చేయడం, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లో లైవ్​లను చూడడటానికి సమయం వెచ్చిస్తున్నారు. ఈ కారణంగా ఇంటర్నెట్‌ వినియోగంపై భారాన్ని తగ్గించేందుకు భారత్​, లాటిన్​ అమెరికాల్లో వీడియో నాణ్యతను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి ఈ సంస్థలు.

ఇదీ చదవండి: కరోనాపై గెలిచిన హైదరాబాదీకి మోదీ ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.