ETV Bharat / bharat

కరోనా వైరస్: కేరళ-వుహాన్​ మధ్య బంధం ఏమిటీ? - కేరళలోనే కరోనా కేసులకు గల కారణమేంటీ?

కరోనా వైరస్... చైనాలో ప్రారంభమై పలు దేశాలకు వ్యాపించింది. మన దేశంలోనూ కరోనాకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. అయితే ఆ మూడు కేసులు కూడా కేరళకు చెందినవే కావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైరస్​ సోకిన ముగ్గురు విద్యార్థులు చైనాలోని వుహాన్​ విశ్వవిద్యాలయానికి చెందినవారే. అసలు కేరళకు, వుహాన్​కు మధ్య ఉన్న సంబంధం ఏమిటీ?

Novel coronavirus turns spotlight on Wuhan, Kerala connect
కరోనా వైరస్: కేరళ-వుహాన్​ మధ్య బంధం ఏమిటీ?
author img

By

Published : Feb 5, 2020, 6:06 AM IST

Updated : Feb 29, 2020, 5:42 AM IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ 25కు పైగా దేశాలకు వ్యాపించింది. మన దేశంలోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. ఈ వైరస్ సోకిన ముగ్గురు విద్యార్థులు వుహాన్​ విశ్వవిద్యాలయానికి చెందినవారే. ఈ నేపథ్యంలో కేరళ-వుహాన్​ల సంబంధాలపై అందరి దృష్టి పడింది. చైనాలోని వుహాన్​ విశ్వవిద్యాలయానికి కేరళకు ఉన్న సంబంధమేమిటీ అనే ప్రశ్నం అందిరిలోనూ ఉత్పన్నమవుతోంది.

వైద్య విద్య కోసం

కేరళలోని చాలా మంది విద్యార్థులు చైనాలో... ముఖ్యంగా వుహాన్​లో విద్యనభ్యసించడానికి మొగ్గుచూపుతున్నారు. వైద్య విద్యకు వుహాన్ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. అత్యుత్తమ సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, అందుబాటు ఫీజుతో నాణ్యమైన వైద్య విద్య అందించటమే ఇందుకు కారణం. దీంతో చైనాలోని వుహాన్ యునివర్సిటీ స్కూల్​ ఆఫ్ మెడిసిన్​లో చేరడానికి పెద్ద సంఖ్యలో కేరళ విద్యార్థులు తరలివెళ్తున్నారు.

"వుహాన్​ విశ్వవిద్యాలయంలోని వైద్య విద్యావ్యవస్థ పట్ల సంతోషంగా ఉంది. వారు సరసమైన ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు."
-వుహాన్​ నుంచి తిరిగి వచ్చిన కేరళ విద్యార్థి

ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు వుహాన్ విశ్వవిద్యాలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని మరో విద్యార్థిని ఐశ్వర్య హరిహరన్ తెలిపారు. కళాశాలకు సెలవులు కావడం వల్ల జనవరి మొదట్లోనే ఆమె వుహాన్​ నుంచి భారత్​కు తిరిగి వచ్చారు.

"వుహాన్​లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య బోధిస్తారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశీ విద్యార్థులకు తరగతులు ఆంగ్లంలో బోధిస్తారు. మా బ్యాచ్​లో 70 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. అందులో 50 మంది కేరళకు చెందినవారే."
-ఐశ్వర్య హరిహరన్, వుహాన్​లోని కేరళ విద్యార్థి

తక్కువ ఫీజుతో అంతర్జాతీయ ప్రమాణాలు లభిస్తుండడం వల్ల తల్లితండ్రులు సైతం తమ పిల్లలను వుహాన్​కు పంపేందుకు సిద్ధమవుతున్నారు.

"వుహాన్​లో నా కూతురి వసతుల కోసం సంవత్సరానికి రూ.5-6 లక్షలు ఖర్చు చేస్తున్నాను. ఇది భారత్​లోని అతి తక్కువ ప్రమాణాలున్న మెడికల్ సంస్థతో పోలిస్తే చాలా చవక. అంతేగాక విదేశాల్లో చదివితే విద్యార్థులకు కూడా అంతర్జాతీయ పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది."
-ఓ విద్యార్థి తల్లితండ్రులు

500 మందికిపైగా..

సుమారు 500 మందికి పైగా కేరళ విద్యార్థులు వుహాన్ స్కూల్​ ఆఫ్ మెడిసిన్​లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వుహాన్​ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ ప్రమాణాల పరంగా భారత ప్రభుత్వ గుర్తింపు కూడా ఉండటం మరో కలిసి వచ్చే అంశం. అంతేగాక చైనాలోని ముఖ్యమైన నగరాలలో వుహాన్ ఒకటి. రాజధాని బీజింగ్​కు వెయ్యి కిలో మీటర్ల దూరంలో, మరో ప్రధాన నగరమైన షాంఘైకు 800 కిలోమీటర్ల దూరంలో వుహాన్ ఉంది. ఈ నగరం 20 శతాబ్దంలో చైనాలో చారిత్రక పాత్ర పోషించింది.

గల్ఫ్​కు పారిపోయిన కేరళ విద్యార్థులు..

కేరళలో మూడు కరోనా కేసులు నమోదైన వేళ వుహాన్​ నుంచి వచ్చిన ఇద్దరు విద్యార్థులు ప్రత్యేక శిబిరం నుంచి పారిపోవటం కలకలం రేపుతోంది. ఆదేశాలను లెక్కచేయకుండా గల్ఫ్​కు పయనమైనట్లు అధికారులు వెల్లడించారు.

"విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన వారు ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోయినా... వారందరూ 28 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని మేం అభ్యర్థిస్తున్నాం."- డాక్టర్ జయశ్రీ, కోజికోడ్ వైద్యాధికారి

జనవరి 15న భారత్​కు వచ్చిన వారిని నిర్బంధంలో ఉంచారు అధికారులు. కరోనా వైరస్ లక్షణాలు బయటపడేందుకు 28 రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో భారత్​కు చేరుకున్నవారిని 28 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారు. అయితే ఇద్దరు విద్యార్థులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్​లో 306 మంది పర్యవేక్షణలో ఉండగా... మరో నలుగురిని ఆస్పత్రిలోని వార్డుల్లో ఉంచారు.

ఇదీ చదవండి: సామ్​ చిత్రమా.. రవివర్మకే అందని అందమా!

Intro:Body:

sdfg

Conclusion:
Last Updated : Feb 29, 2020, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.