కరోనా లక్షణాలు లేనివారి నుంచీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్' ఈమేరకు వ్యాసం ప్రచురించింది. వైరస్ వేర్వేరు వస్తువులపై బతికి ఉండే కాలాన్నీ వివరించింది. వాటిని ముట్టుకుని ఇతరులతో సన్నిహితంగా మెలిగితే వారికి సోకే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
కాలిఫోర్నియా-లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయం(యూసీఎల్ఏ) పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. 2003లో వచ్చిన సార్స్, నేటి కరోనా వైరస్‌లను పోల్చారు. ఈ వైరస్లు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో పరిశీలించారు.
వైరస్ ఇంట్లోని వస్తువులకు, ఆసుపత్రిలో ఎలా వ్యాపిస్తుందో గుర్తించేందుకు యత్నించారు శాస్త్రవేత్తలు. ఆయా వస్తువులపై వైరస్ జాడను గుర్తించి అక్కడ బతికుండే కాలాన్ని గణించారు.
3 గంటల్లోనే...
స్వేద, లాలాజలాన్ని పరిశోధించడం ద్వారా మూడుగంటల్లోగా వైరస్‌ను గుర్తించవచ్చని పేర్కొన్నారు పరిశోధకులు. వారి అధ్యయనంలో తేలిన మరిన్ని అంశాలు:
- కరోనా నాలుగు గంటలపాటు రాగిపై నిలిచి ఉంటుందని తేల్చారు పరిశోధకులు. కార్డ్‌బోర్డుపై 24 గంటలపాటు వైరస్ బతికి ఉంటుందని, అదే సమయంలో ప్లాస్టిక్‌పై మూడు రోజులవరకు ఉండగలదని చెప్పారు.
- సార్స్ వ్యాధి బాధితులను గుర్తించి ఇతరులకు దూరంగా ఉంచడం ద్వారా నాడు వ్యాప్తిని అరికట్టగలిగారు. ఈ నేపథ్యంలో కరోనా కూడా ఇదే లక్షణం కలిగి ఉందని తేల్చారు శాస్త్రవేత్తలు. అయితే కరోనా వ్యాప్తి సార్స్‌తో పోల్చితే ఎక్కువని చెప్పారు.
- కరోనా సోకిన వారు తమకు తెలియకుండానే వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో వ్యాధి లక్షణాలు కనిపించకముందే ఈ ప్రమాదం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
- సార్స్ వ్యాధి సమయంలో వైరస్‌ను అరికట్టేందుకు ఎక్కువగా చర్యలు తీసుకున్నారని, కానీ కరోనా నియంత్రణ కోసం ఇలా జరగలేదని తేల్చి చెప్పారు. సార్స్‌కు భిన్నంగా ఆసుపత్రుల్లో కంటే.. సామాజికంగానే కరోనా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.
- ఆసుపత్రుల్లో కరోనా ఎక్కువగా విస్తరించేందుకు అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యులకు సూచనలు చేశారు.
ఇదీ చూడండి: న్యూయార్క్‌పై కరోనా పంజా- 5వేలకుపైగా పాజిటివ్ కేసులు