కరోనా మహమ్మారి కారక సార్స్-కోవ్-2 వైరస్ చర్మంపై 9 గంటలు బతికి ఉంటుందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఫ్లూ వైరస్ కారకాలతో పోల్చితే ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించింది.
ఆ వైరస్ 2 గంటలే
ఇన్‌ఫ్లూయెంజా ఏ వైరస్ (ఐఏవీ) మానవ శరీరంపై 2 గంటలు మాత్రమే బతికి ఉంటుందని జపాన్‌కి చెందిన క్యోటో ప్రిఫెక్చురల్ మెడికల్ విశ్వవిద్యాలయ విశ్లేషకులు వెల్లడించారు.
క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్
ఈ అధ్యయనాన్ని 'క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్' అనే జర్నల్‌లో ప్రచురించారు. సార్స్-కోవ్-2, ఐఏవీ రెండు వైరస్‌లూ శానిటైజర్ వాడకంతో కనుమరుగైపోయాయని అధ్యయనంలో పేర్కొన్నారు. కానీ, మానవ శరీరంపై కొవిడ్ వైరస్ ఎంత సేపు బతికి ఉంటుందనే దానిపై స్పష్టత లేదని తెలిపారు.
పరిశోధకులు చేసిందేంటి?
- జిగట పదార్థంతో సార్స్-కోవ్-2, ఐఏవీ వైరస్‌లను కలిపి, దాన్ని మానవ శరీరంపై పెట్టి వైరస్ కదలికలను పరిశీలించారు.
- 80 శాతం ఇథనాల్‌ని శరీరంపై ఉపయోగించి... సార్స్-కోవ్-2, ఐఏవీ ప్రభావం ఎలా ఉందో పరిశీలించారు.
- స్టీల్, గ్లాస్, ప్లాస్టిక్‌లపై వైరస్ ఎక్కువ సేపు బతికి ఉంటుందని నిపుణులు గుర్తించారు.
- ఐఏవీతో పోల్చితే సార్స్-కోవ్-2 వల్ల కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ ఎక్కువగా జరుగుతోందని వెల్లడించారు.
కరోనాను నియంత్రించాలంటే శుభ్రత తప్పనిసరి అని హెచ్చరించారు.