ఉత్తరాదిని వరణుడు వణికిస్తున్నాడు. వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
బిహార్లో 13 జిల్లాలు జలదిగ్బంధం
భారీ వర్షాలకు బిహార్ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా 13 జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. మొత్తం 90 లక్షల మందిపై వర్షాల ప్రభావం పడింది. ఇప్పటి వరకు 130 మంది ప్రణాలు కోల్పోయినట్లు విపత్తు నిర్వాహణ విభాగం వెల్లడించింది.
కోలుకోని అసోం...
గత కొన్ని రోజులుగా అసోంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని 12 జిల్లాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మృతుల సంఖ్య 88. మొత్తం 1.6 లక్షల మంది వరదల బారిన పడ్డారు.
ముంబయికి భారీ వర్ష సూచన
రెండు రోజులుగా ముంబయిలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే శని, ఆదివారం నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఒడిశాపైనా...
ఇటీవలే కురిసిన కుండ పోత వర్షాలకు ఒడిశా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మల్కాన్ గిరి జిల్లాకు రొడ్డు సంబంధాలు తెగిపోయాయి. బంగాలఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా ఆదివారం ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి: జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు