ETV Bharat / bharat

కశ్మీర్​: ఆంక్షలు సడలించినా.. తప్పని ఇక్కట్లు - కశ్మీర్​

శుక్రవారం జమ్ముకశ్మీర్​లో విధించిన ఆంక్షలను అధికారులు సడలించారు. కానీ జనజీవనం ఇంకా మెరుగుపడలేదు. మార్కెట్లు, వాణిజ్య కేంద్రాలు మూతపడే ఉన్నయి. ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

కశ్మీర్​: ఆంక్షలు సడలించినా.. తప్పని ఇక్కట్లు
author img

By

Published : Sep 8, 2019, 6:16 AM IST

Updated : Sep 29, 2019, 8:30 PM IST

కశ్మీర్​: ఆంక్షలు సడలించినా.. తప్పని ఇక్కట్లు

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసి నెల రోజులు గడిచినప్పటికీ ఆ రాష్ట్రంలో జనజీవనం ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శుక్రవారం విధించిన ఆంక్షలను సడలించినా.. ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.

కశ్మీర్​లోని సున్నిత ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం ఆంక్షలను విధిస్తున్నారు అధికారులు. మసీదులు, ఆలయాల్లో సమావేశమయ్యే వారిలో కొంత మంది స్వార్థ ప్రయోజనాలతో అలజడులు సృష్టించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్​ 370ని రద్దు చేసి... జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఆంక్షలను సడలించినా.. శనివారం అనేక మార్కెట్లు, వాణిజ్య కేంద్రాలు ఇంకా మూతపడే ఉన్నాయి. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ తేరుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నప్పటికీ... విధులకు హాజరయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. పాఠశాలను తెరవడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు తల్లిదండ్రుల భయాలతో విఫలమయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్​లైన్​ సేవలను పునరుద్ధరించారు. కానీ అంతర్జాలం, మొబైల్​ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:- ఇస్రో.. నీ ప్రయాణం స్ఫూర్తిదాయకం: నాసా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jyllandsringen, Denmark - 7th September 2019
++Video contains Danish commentary as incoming++
1. 00:00 Rain falls during race
2. 00:03 Various of car pile-up
SOURCE: PolarHD
DURATION: 00:34
STORYLINE:
Heavy rain led to a mass pile-up during a DS3 Cup race at Denmark's FDM Jyllandsringen circuit on Saturday.
A succession of cars slid off the track, leading to a dramatic scene on the trackside sand - and a red flag.   
Medical personnel said one of the drivers suffered two broken ribs, while the others involved in the accident were not seriously hurt.
This was the fifth stop of six in the series, which also takes in Norway and Sweden.
Last Updated : Sep 29, 2019, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.