ETV Bharat / bharat

ఎన్​ఆర్​సీలో పేర్లు లేనివారికి కేంద్రం భరోసా - ASSAM NRC

ఎన్​ఆర్​సీ జాబితాలో పేర్లు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. వారికి అన్ని హక్కులు, సౌకర్యాలు ఉంటాయని పేర్కొంది. న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరుకూ ఎలాంటి చర్యలు తీసుకోమని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఎన్​ఆర్​సీలో పేర్లు లేనివారికి కేంద్ర హోంశాఖ భరోసా
author img

By

Published : Sep 2, 2019, 9:02 PM IST

Updated : Sep 29, 2019, 5:17 AM IST

అసోం ఎన్​ఆర్​సీ తుది జాబితాలో పేర్లు లేని పౌరులకు ఊరట కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జాబితాలో లేని వ్యక్తులు ఫారిన్​ ట్రైబ్యునళ్లను నాలుగు నెలల్లోపు ఆశ్రయించేందుకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. పౌరుల సౌలభ్యం కోసం ఇప్పటికే ఉన్న 100 ట్రైబ్యునల్స్​కు అదనంగా మరో 200 ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

రెండు రోజుల క్రితం విడుదలైన ఎన్​ఆర్​సీ జాబితాలో 19 లక్షల మంది వివరాలు గల్లంతయ్యాయి. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​ తెలిపారు. ప్రభుత్వపరంగా అందరినీ సంరక్షిస్తామన్నారు. తుది జాబితాలో పేర్లు లేని వారందరికీ భారత పౌరసత్వం పొందేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

జాబితాలో పేర్లు లేని వారందరి హుక్కులు, సౌకర్యాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారిపై ఎలాంటి చర్యలు ఉండవని పేర్కొంది.

ఇదీ చూడండి:సంప్రదాయాల ప్రతిబింబం.. 'ఓనం' పండుగ ఆరంభం

New Delhi, Sep 02 (ANI): A delegation of Sikh community reached Pakistan High Commission in the national capital on September 2. They reached High Commission to give a memorandum over the forced religious conversion in the neighbouring country. Recently, a Sikh girl was allegedly forced to convert his religion to Islam before being married to a Muslim man. Protests have also erupted over the forced conversion in Delhi.
Last Updated : Sep 29, 2019, 5:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.