ETV Bharat / bharat

'బిహార్​లో అధికారం మళ్లీ ఎన్​డీఏదే'

బిహార్​ శాసనసభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ పూర్తి ఆధిక్యం సాధించలేదని ఉపముఖ్యమంత్రి, భాజపా నేత సుశీల్ మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం నితీశ్​ కుమార్ నేతృత్వంలో ఎన్​డీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్​డీఏకి ప్రతిపక్షాలు ఎలాంటి పోటీ ఇవ్వలేవని ఎద్దేవా చేశారు.

BH-SUSHIL MODI INTERVIEW
సుశీల్ మోదీ
author img

By

Published : Sep 1, 2020, 6:49 PM IST

బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్​డీఏ విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేయలేదని అభిప్రాయపడ్డారు. బిహార్​ ఎన్నికలకు సంబంధించి పీటీఐ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు సుశీల్ మోదీ.

రాష్ట్రీయ జనతా దళ్ నేతృత్వంలోని 'మహాకూటమి'.. అధికార ఎన్​డీఏకి ఎలాంటి పోటీ ఇవ్వలేదని అన్నారు. ప్రతిపక్ష కూటమి విశ్వసనీయతను కూడా కోల్పోయిందని ఎద్దేవా చేశారు.

"రాష్ట్రంలో ఏ పార్టీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. భాజపా, జేడీయూ, ఆర్​జేడీ త్రిముఖ శక్తులుగా ఉన్న రాష్ట్రంలో ఇది అసాధ్యం. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ నాయకత్వంలో ఐక్యంగా పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తాం."

- సుశీల్ మోదీ, భాజపా సీనియర్ నేత

అంతర్గత వివాదాలపై..

భాజపా, జేడీయూ మధ్య బంధం 1996 నుంచి కొనసాగుతోందని మోదీ తెలిపారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని ఈ కూటమి అందించిందని, రెండు పార్టీల మధ్య సమన్వయం చక్కగా కుదిరిందని చెప్పారు. అయితే 2014 లోక్​సభ ఎన్నికలు, 2015 శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడటంపై వివరణ ఇచ్చారు మోదీ.

"భాజపాకు తన సామర్థ్యంపై విశ్వాసం ఉంది. కానీ, కలిసి పోరాడినప్పుడు మాత్రమే విజయం సాధిస్తాం. భాజపా కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో ఎలాంటి భ్రమలో లేదు. మా కూటమిలో అన్ని పార్టీల నాయకత్వాలు పటిష్ఠంగా ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. భాజపా-జేడీయూ-ఎల్​జేపీ కూటమిలో ఎలాంటి చీలిక ఉండదు."

- సుశీల్ మోదీ, భాజపా సీనియర్ నేత

అభ్యర్థి ఆయనే..

రాష్ట్రంలోని ఎన్​డీఏకి భవిష్యత్తులో భాజపా నాయకత్వం వహిస్తుందని మోదీ జోస్యం చెప్పారు. అయితే ప్రస్తుతానికి సీఎం అభ్యర్థిగా నితీశ్​ ఉంటారని భాజపా ఇప్పటికే నిర్ణయించిందని తెలిపారు.

బిహార్​ శాసనసభ ఎన్నికలు అక్టోబర్​- నవంబర్​ మధ్య కాలంలో నిర్వహించనున్నారు. నవంబర్​ 29న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఎలక్షన్​ కమిషన్​ తెలిపింది.

ఇదీ చూడండి: 'త్రీ గ్రేడ్' వ్యూహంతో బిహార్​ పోరుకు ఓవైసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.