ETV Bharat / bharat

'ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేరు' - బంగాల్​ రాజకీయాలు అమిత్​ షా

భారత్​- చైనా సరిహద్దు వివాదంపై కేంద్రమంత్రి అమిత్​ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వం నిత్యం అప్రమత్తంగా ఉండి దేశ సార్వభౌమాధికారం, సరిహద్దును రక్షిస్తోందన్నారు.

No one can take an inch of Indian territory: Shah on Ladakh row
'ఒక్క అంగుళాన్ని కూడా ఎవరు ఆక్రమించలేరు'
author img

By

Published : Oct 18, 2020, 9:24 AM IST

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతకై నిత్యం అప్రమత్తంగా ఉంటోందని కేంద్రమంత్రి అమిత్​ షా అన్నారు. దేశ భూభాగంలోని ఒక్క అంగుళం కూడా ఎవరు ఆక్రమించుకోలేరన్నారు.

భారత్​- చైనా ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ప్రభుత్వం మిలిటరీ-దౌత్య స్థాయిలో అన్ని చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు షా.

"మన భూభాగంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకునేందుకు మేము అప్రమత్తంగా ఉన్నాం. ఎవరూ ఆక్రమించుకోలేరు. దేశ సార్వభౌమాధికారం, సరిహద్దును రక్షించుకునే శక్తి మన భద్రతా బలగాలకు, నాయకత్వానికి ఉంది."

--- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

'బంగాల్​లో భాజపా జెండా..'

వచ్చే ఏడాది జరగనున్న బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు షా. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రభుత్వం తూట్లుపొడుస్తోందని.. ఫలితంగా అక్కడ రాష్ట్రపతి పాలనను విధించాలని డిమండ్​ చేసే హక్కు భాజపా వంటి పార్టీలకు ఉందన్నారు.

హాథ్రస్​ ఘటనపై స్పందించిన షా... విషయాన్ని రాజకీయం చేసిన విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘటన జరిగిన రోజే నిందితులను అరెస్టు చేశారని.. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుగుతోందన్నారు.

ఇదీ చూడండి- బిహార్​ తర్వాతి సీఎం ఆయనే: అమిత్​షా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.