ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో 4వ రోజూ కరోనా కేసులు సున్నానే - ఉత్తరాఖండ్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఉత్తరాఖండ్​పై వైరస్​ ప్రభావం కనిపించటం లేదు. వరుసగా నాలుగో రోజు ఒక్క కేసు నమోదు కాలేదు.

uttarakhand govt
ఉత్తరాఖండ్​లో కరోనా కట్టడి స్కెచ్​ హిట్​
author img

By

Published : Apr 12, 2020, 7:37 PM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ఉత్తరాఖండ్​లో అసలు కొత్త కేసులు నమోదు కాకపోవటం గమనార్హం. వరుసగా నాలుగోరోజు ఒక్క పాజిటివ్​ కేసు నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్​ బారిన పడినవారి సంఖ్య 35 మాత్రమే. అందులో ఐదుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు.

లాక్​డౌన్​కు తోడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలే కొత్త కేసులు నమోదు కాకపోవటానికి కారణంగా చెబుతున్నారు అధికారులు.

ఇదీ చూడండి: కరోనా కలవరం: 'మహా'లో 134, రాజస్థాన్​లో 96 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.