ETV Bharat / bharat

మద్యం దొరక్క మిథనాల్​ తాగి ముగ్గురు మృతి - కడలూరు

లాక్​డౌన్ వేళ కిక్కు కోసం రసాయనం తాగి ఐదుగురు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. తమిళనాడు కడలూరులో మిథనాల్​ తాగి ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

No liquor shop: Three people died by drinking methanaolNo liquor shop: Three people died by drinking methanaol
మద్యం దొరకక మిథనాల్​ తాగి ముగ్గురి మృతి
author img

By

Published : Apr 15, 2020, 5:03 PM IST

దేశవ్యాప్త లాక్​డౌన్​తో మద్యం దొరక్క ఇక్కట్లు పడుతున్నారు మందు బాబులు. మద్యానికి బాగా అలవాటు పడిన కొందరు... చుక్క దొరక్క అనారోగ్యం పాలయ్యారు. మరికొందరు ఏకంగా వైన్​ షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. తమిళనాడుకు చెందిన ఓ ఐదుగురు మాత్రం... రసాయనం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

కడలూరు జిల్లా అలప్పక్కానికి చెందిన మురుగేసన్​, ఎళిల్వానన్​, మాయాకృష్ణన్​, చంద్రహాసన్​, సుందరరాజన్...​ అక్రమంగా మద్యం కొనుగోలు చేసి తాగారు. అయినా వారి దాహం తీరలేదు. సిప్​కాట్​(ప్రభుత్వ పారిశ్రామిక ప్రాంతం) నుంచి మిథనాల్​ దొంగిలించి తాగారు. వెంటనే వారు ఐదుగురు స్పృహా కోల్పోగా ఆస్పత్రికి తరలించారు. వీరిలో మాయాకృష్ణన్​, చంద్రహాసన్​, సుందరరాజన్​ ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ 2.0: కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.