ETV Bharat / bharat

శిరస్త్రాణం లేకుంటే పెట్రోల్‌ బంద్‌ - కోల్​కతా పోలీసులు

ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా శిరస్త్రాణం ధరించే లక్ష్యంతో కోల్​కతా పోలీసులు కఠిన నిబంధనను అమలుకు సిద్ధం అయ్యారు. డిసెంబర్‌ 8 నుంచి హెల్మెట్​ లేనివారికి పెట్రోల్​ బంక్​లో ఇంధనం పట్టకూడదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

'No helmet, no fuel' rule in Kolkata from Dec 8
శిరస్త్రాణం లేకుంటే పెట్రోల్‌ బంద్‌
author img

By

Published : Dec 5, 2020, 6:16 PM IST

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నిబంధనలను కోల్​కతా పోలీసులు మరింత కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనంపై ఉన్నవారు హెల్మెట్‌ ధరించకుండా పెట్రోల్‌ బంక్‌కు వెళితే వారికి పెట్రోల్‌ పోయకూడదు అనే నిబంధనను తీసుకొచ్చారు. డిసెంబర్‌ 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

'హెల్మెట్‌ లేకుండా పెట్రోల్‌ బంకుల్లోకి వచ్చే వాహనదారులకు పెట్రోల్‌ పోయకూడదు. కోల్‌కతా నగర పరిధిలోకి వచ్చే అన్ని పెట్రోల్‌ బంకులకు ఈ నిబంధన వర్తిస్తుంది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులుంటే వారిద్దరికీ హెల్మెట్‌ ఉంటేనే ఇంధనం పోయాలి' అని పోలీసు శాఖ ప్రకటన విడుదల చేసింది.

హెల్మెట్లు కచ్చితంగా ధరించాల్సిందేనని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రక్షణ కవచం ధరించే బైక్‌ నడపాలన్నారు. 'అన్ని ప్రభుత్వాల మాదిరి హెల్మెట్‌ లేకుంటే రూ.2 వేల ఫైన్‌ వేస్తామని చెప్పను. ఫైన్‌కు బదులు అందరూ హెల్మెట్‌ ధరించాలని వేడుకుంటాను' అని పేర్కొన్నారు. హెల్మెట్ కొనుక్కోలేని పరిస్థితి ఉన్నవారు స్థానిక పోలీసుస్టేషన్‌లో నమోదు చేసుకుంటే ప్రభుత్వమే వారికి ఉచితంగా రక్షణ కవచాన్ని అందిస్తుందని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఎయిర్​పోర్టులో 8.5 కిలోల బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.