ETV Bharat / bharat

హిమాచల్​​ప్రదేశ్​లో 3 రోజులుగా కరోనా కేసులు 'సున్నా' - Jharkhand Corona latest

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ తీవ్రమవుతున్న కేసులు ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే హిమాచల్​ప్రదేశ్​లో మాత్రం వైరస్​ ప్రభావం తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఆ రాష్ట్రంలో ఒక్కకేసూ నమోదుకాకపోవడం గమనార్హం.

No fresh COVID-19 case reported in Himachal Pradesh for three days
హిమాచల్​ప్రదేశ్​లో 3 రోజులుగా కరోనా కేసులు 'సున్నా'
author img

By

Published : Apr 26, 2020, 11:54 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ .. హిమాచల్​ ప్రదేశ్​లో మాత్రం ఆ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. గతమూడు రోజులుగా ఆ రాష్ట్రంలో ఒక్క కొవిడ్​-19 పాజిటివ్​ కేసు కూడా నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. హిమాచల్​ ప్రదేశ్​లో ఇప్పటివరకు 41 మందికి వైరస్​ సోకగా.. 22 మంది డిశ్చార్జ్​ అయ్యారు. మరో 13 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం తెలిపింది​.

మహారాష్ట్ర, దిల్లీలో తీవ్రం

మరోవైపు మహారాష్ట్ర, దిల్లీలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 440 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 8,068కి పెరిగింది. వైరస్​ బారినపడి మరో 19 మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 342 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,188 మంది డిశ్చార్జ్​ అయ్యారు.

దిల్లీలోనూ ఇవాళ కొత్తగా 293 మందికి వైరస్​ కేసులు బయటపడ్డాయి. దీంతో బాధితుల సంఖ్య 2,918 కు పెరిగింది. దేశరాజధానిలో ఇప్పటివరకు 54 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్​లో ఒక్కరోజు వ్యవధిలో 230 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,301కు ఎగబాకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్​ ధాటికి 151 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 313 మంది డిశ్చార్జ్​ అయ్యారు.

తమిళనాడులో వెయ్యి మంది డిశ్చార్జ్​

తమిళనాడులో 24 గంటల వ్యవధిలో మరో 64 మంది కొవిడ్​ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 1,885 కు చేరింది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 1,020 మంది వైరస్​పై పోరాడి డిశ్చార్జ్​ అయ్యారు.

మధ్యప్రదేశ్​లో వైరస్​ బాధితుల సంఖ్య 2 వేలు దాటింది. ఈ రోజు నిర్వహించిన కొవిడ్-19​ పరీక్షల్లో 145 మందికి పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,090 కు చేరగా.. 103 మంది మరణించారు. రాష్ట్రంలో ఇండోర్​ ప్రాంతంలో వైరస్​ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 1,176 ఇండోర్​లోనే నమోదయ్యాయి.

బిహార్​లో మరో 19 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 274 కు చేరింది. అయితే 11 మంది ఈ మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఝార్ఖండ్​లో ఒక్కరోజులోనే అత్యధిక స్థాయిలో 15 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 82కు చేరింది.

ఇదీ చదవండి: 'కరోనాపై పోరులో ఓర్పు, క్రమశిక్షణే కీలకం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.