ETV Bharat / bharat

'పౌరసత్వ చట్టం అమలు కాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు' - పౌరసత్వ చట్టం

పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఎన్​పీఆర్ అమలును తక్షణం నిలిపివేయాలని కాంగ్రెస్ వర్కింగ్​ కమిటీ డిమాండ్​ చేయడంపై భాజపా తీవ్రంగా స్పందించింది. పౌరసత్వ చట్టం అమలును భూమిపై ఉన్న ఏ శక్తీ అడ్డుకోలేదని తేల్చిచెప్పింది. ఎన్​పీఆర్ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వనీతి ప్రదర్శిస్తోందని విమర్శించింది.

No force on earth can stall CAA implementation says BJP
'పౌరసత్వ చట్టం అమలుకాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు'
author img

By

Published : Jan 12, 2020, 4:43 AM IST

Updated : Jan 12, 2020, 7:48 AM IST

పౌరసత్వ చట్టం అమలును భూమిపై ఉన్న ఎటువంటి శక్తీ ఆపలేదని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్​పీఆర్) ప్రక్రియపై కాంగ్రెస్​ ద్వంద్వ నీతి అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు.

సోనియాగాంధీ నేతృత్వంలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ... సీఏఏను ఉపసంహరించుకోవాలని , ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీ అమలు ప్రక్రియను వెంటనే నిలివేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే భాజపా... కాంగ్రెస్​పై ఎదురుదాడికి దిగింది.

కాంగ్రెస్ వాగ్దానాల మాటేమిటి?

రాజస్థాన్​ ఎన్నికల మేనిఫెస్టోలో హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని జీవీఎల్ నరసింహారావు గుర్తుచేశారు.

"రాజస్థాన్, గుజరాత్​ల్లోని హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని 2005, 2006ల్లో అప్పటి మన్మోహన్​సింగ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే మన్మోహన్​ సింగ్​ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా పాకిస్థాన్, బంగ్లాదేశ్​ నుంచి వచ్చిన మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించాలని కోరారు."- జీవీఎల్​ నరసింహారావు, భాజపా అధికార ప్రతినిధి

కాంగ్రెస్ ద్వంద్వ నీతి

2010లో లౌకికమైనదిగా ఉన్న ఎన్​పీఆర్...​ 2020 నాటికి ఎలా ప్రమాదకరంగా మారిందో కాంగ్రెస్ వివరించాలని నరసింహారావు డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్​పీఆర్​ల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వనీతి ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు.

ఇదీ చూడండి: 'బర్త్​డే విషెస్​​ చెప్పినంత మాత్రాన చర్చలు జరగవు'

Last Updated : Jan 12, 2020, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.