జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)పై విపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పట్టిక సవరణకు ఎలాంటి పత్రాలతో పాటు బయోమెట్రిక్ తీసుకోబోమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
ఎన్పీఆర్ ప్రక్రియ కోసం ప్రశ్నావళితో కూడిన ఫారాన్ని త్వరలో సిద్ధం చేస్తామని హోంశాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం ఎలాంటి ధ్రువపత్రాల సమర్పణ లేదా బయోమెట్రిక్ అవసరం లేదని పేర్కొన్నారు.
డేటాబేస్లో వివరాలు...
రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణాంక కమిషనర్ కార్యాలయ వెబ్సైట్లో ఎన్పీఆర్ డేటాబేస్ కోసం భౌగోళిక, బయోమెట్రిక్ వివరాలు ఉంటాయని తెలిపారు.
ఎన్పీఆర్కు సంబంధించి కేరళ, బంగాల్ రాష్ట్రాలు అయిష్టతను వ్యక్తం చేయగా.. చాలా రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
రాష్ట్రాలతో సమావేశం
ఎన్పీఆర్ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం ఈ నెల 17న సమావేశం కానుంది. ఈ సమావేశానికి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కానని ప్రకటించారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు దిల్లీ హైకోర్టులోనూ నిరాశే