ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ రంగాల ప్రముఖలు బహిరంగ లేఖ రాశారు. దేశంలో ముస్లింలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న మూకదాడులను తక్షణమే అరికట్టాలని కోరారు.
'సమస్యను ఖండిస్తే సరిపోదు'
దర్శకులు శ్యామ్ బెనగల్, అపర్ణ సేన్, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా 49 మంది ప్రముఖులు మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. 'జై శ్రీరామ్' అన్న పదాన్ని ఇతరులను రెచ్చగొట్టేందుకు ఒక యుద్ధ నినాదంలా ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ వేదికగా మూకదాడులను మోదీ ఖండించడాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి అంశాలను కేవలం ఖండిస్తే సరిపోదన్నారు. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రధానిని ప్రశ్నించారు.
లేఖలోని మరిన్ని అంశాలు...
- 2016లో ఎస్సీలపై దురాగతాలకు సంబంధించి దాదాపు 840 ఘటనలు జరిగాయి. నేరాల సంఖ్య పెరుగుతోంది. కానీ నేరస్థులకు శిక్ష పడే శాతం తగ్గిపోతోంది.
- ఎన్నో వర్గాలకు రాముడు పవిత్ర దైవం. రాముని పేరు అగౌరవపరచడం ఆపండి.
అసమ్మతి లేనిదే ప్రజాస్వామ్యం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై జాతి వ్యతిరేకులు, నక్సలైట్లనే ముద్ర వేయకూడదు.
ఇదీ చూడండి:- కుక్క ప్రేమ వర్సెస్ యజమాని పరువు..!