అన్నాడీఎంకే మాజీ నేత టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దినకరన్ నాయకత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్(ఏఎంఎంకే) పార్టీకి కుక్కర్ గుర్తు ఇవ్వడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వేరే చిహ్నం కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల సంఘానికి మరింత స్పషత ఇచ్చింది. ఏఎంఎంకే పార్టీకి గుర్తింపునివ్వడం తమ పని కాదని సుప్రీం పేర్కొంది. గుర్తు మాత్రం కేటాయించాలని ఈసీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.