ETV Bharat / bharat

కరోనాతో వచ్చిన మార్పు మంచికే: ఆరోగ్య మంత్రి

author img

By

Published : May 5, 2020, 4:07 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్ దశకు చేరుకోలేదని తెలిపారు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్​. వైరస్​ కారణంగా మన పరివర్తలో వచ్చిన మార్పు ఆరోగ్యాన్ని కాపాడుకునేలా మేలు చేస్తుందని అన్నారు.

Harsh Vardhan
కరోనాతో వచ్చిన మార్పు మంచికే: ఆరోగ్యమంత్రి

కరోనా కారణంగా సమాజంలో వచ్చిన మార్పు భవిష్యత్తులో ఆరోగ్యంగా జీవించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్​. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వైరస్​ ప్రభావం తగ్గిన తర్వాత కూడా జీవితంలో ఓ అలవాటుగా మారుతుందని తెలిపారు. కరోనా వల్ల వచ్చిన మార్పు ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడుతుందని అన్నారు.

భారత్​లో కరోనా కేసుల సంఖ్య పెరగుతున్నప్పటికీ ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్​(స్థానికంగా ఒకరి ద్వారా మరొకరికి వ్యాపించే) దశకు చేరుకోలేదని చెప్పారు హర్ష వర్ధన్​. కరోనాను నిలువరించేందుకు లాక్​డౌన్​ విధించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆర్థిక వ్యవస్థతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ ముఖ్యమని పేర్కొన్నారు. ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

కరోనాపై పోరాడటం రాకెట్ శాస్త్రం గురించి తెలుసుకోవడం లాంటిది కాదని, పరిశుభ్రత పాటించడం, కనీస జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రించవచ్చని ఇప్పుడు అందరికీ తెలిసిందన్నారు కేంద్రమంత్రి. స్మాల్ పాక్స్​, పోలియో మినహా దేశంలో ఇతర వైరస్​లేవీ పూర్తిగా నశించలేదన్నారు. కరోనా మహమ్మారి దీర్ఘకాలం పాటు ఉంటుందని సూచనప్రాయంగా తెలిపారు.

కరోనా కారణంగా దేశంలో వైద్య వ్యవస్థను మెరగుపర్చాల్సిన ఆవశ్యత, వైద్య పరికరాలను దేశీయంగా తయారు చేయడం ఎంత ముఖ్యమో తెలిసిందని హర్షవర్ధన్​ చెప్పారు. పీపీఈ కిట్లు, ఎన్​-95 మాస్కులు ఉత్పత్తికి ప్రాధాన్యం పెరిగిందన్నారు.

లాక్​డౌన్ విధించడం వల్ల దేశంలో కరోనా కేసుల రెట్టింపు కాలం 12 రోజులకు పెరిగిందని వెల్లడించారు కేంద్రమంత్రి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,433కు చేరింది. మరణాల సంఖ్య 1,568కి పెరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.